GATE 2025 Admit Card: గేట్ 2025 అడ్మిట్ కార్డు విడుదల- డౌన్ లోడ్ ఇలా..!
దేశంలోని జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్, ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గేట్ పరీక్ష (GATE 2025) అడ్మిట్ కార్డులు ఇవాళ విడుదలయ్యాయి. ఈ ఏడాది గేట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఐఐటీ రూర్కీ ఇవాళ అడ్మిట్ కార్డుల్ని ఆన్ లైన్ ద్వారా విడుదల చేసింది. అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) గా పేర్కొనే ఈ పరీక్ష రాసే అభ్యర్ధుల కోసం అడ్మిట్ కార్డుల్ని జనవరి 2నే విడుదల చేయాలని భావించినా వాయిదా పడింది. దీంతో ఇవాళ అడ్మిట్ కార్డులు విడుదల చేశారు. అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ అయిన gate2025.iitr.ac.in లోకి ఎంటర్ అయి వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గేట్ 2025 పరీక్షలు ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్నారు. గేట్ 2025 కంప్యూటర్ ఆధారిత పరీక్ష.

గేట్ అడ్మిట్ కార్డుల్లో అభ్యర్ధుల పేరు, రిజిస్టర్ ఐడీ, పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ, సమయం, పేపర్ కోడ్, వర్గం వంటి వివరాలు ఉన్నాయి. ఇందులో ఏదైనా తేడా ఉంటే వెంటనే అభ్యర్ధులు గేట్ నిర్వహణ అధికారుల్ని సంప్రదించాలి. పరీక్షకు అభ్యర్ధులు అడ్మిట్ కార్డును ప్రింట్ తీసుకుని తీసుకెళ్లాలి. అలాగే ఐడీ ప్రూఫ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. గేట్ అడ్మిట్ కార్డును అభ్యర్ధులు ఇలా డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. గేట్ అధికారిక వెబ్ సైట్ gate2025.iitr.ac.in. లోకి వెళ్లాక.. గేట్ 2025 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నంబర్ , పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయాలి. అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.












Click it and Unblock the Notifications