సీటెట్ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. సిటీ ఇంటిమేష‌న్ స్లిప్పులు వ‌చ్చేసాయ్‌..!

సీటెట్ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. తాజాగా జులై 2024 సెష‌న్‌కు సంబంధించిన సిటి ఇంటిమేష‌న్ స్లిప్పుల‌ను సీబీఎస్ఈ విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష‌కు అప్ల‌య్ చేసుకున్న అభ్య‌ర్థులు సీటెట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి త‌మ ఎగ్జామ్ సెంట‌ర్ వివ‌రాల‌ను తెలుసుకోగ‌ల‌రు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. వ‌చ్చే నెల 7 వ తేదిన సీటెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. తాజాగా వీటికి సంబంధించిన సిటి ఇంటిమేష‌న్ స్లిప్పుల‌ను విడుద‌ల చేశారు. అభ్య‌ర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ప‌రీక్ష మొత్తం 20 భాషల్లో జ‌ర‌గ‌నుంది.

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ప్ర‌తి సంవ‌త్స‌రం రెండుసార్లు జ‌రుగుతుంది. ఇక ఈ ఏడాది జులై సెష‌న్‌కు సంబంధించిన ప‌రీక్ష దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జులై 7వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌ నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్)- జులై 2024 నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 7వ తేదిన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ఈ ప‌రీక్ష‌ను రాస్తారు. ప్రతి ఏడాది రెండుసార్లు (జనవరి, జులై) జాతీయ స్థాయిలో ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. సీటెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7వ తేదీన ప్రారంభంకాగా, అర్హ‌త‌, ఆస‌క్తిక‌లిగిన అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు.

Good news for CTET candidates City Intimation slips are coming

ప‌రీక్షా విధానం..

ఒకటి నుంచి 5వ తరగతులకు బోధించాలనుకునే వారి కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప‌రీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఆరు నుంచి 9వ తరగతులకు బోధించాలనుకునే వారి కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఇది మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండ‌వు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+