IIT JEE Mains 2024 Results: ఐఐటీ ఫలితాల్లో తెలంగాణ రికార్డు-ఏడుగురికి 100 పర్సంటైల్.. !

IIT JEE Mains: ఈ ఏడాది నిర్వహించిన ఐఐటీ జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలు వెలువడ్డాయి. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ jeemain.nta.ac.in వెబ్ సైట్ లో విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్ధులు ఇందులోకి లాగిన్ అయి స్కోర్ కార్డు, ఇతర వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించింది. వీటిలో తెలంగాణకు చెందిన పలువురు విద్యార్ధులు సత్తా చాటుకున్నారు. అయితే వీరిలో కొందరు ఏకంగా 100 పర్సంటైల్ సాధించి అబ్బుర పరిచారు.

ఇవాళ విడుదలైన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఏడుగురు విద్యార్థులు రిషి శేఖర్ శుక్లా, రోహన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హుండేకర్ విదిత్, వెంకట సాయి తేజ మాదినేని, శ్రీయషాస్ మోహన్ కల్లూరి, తవ్వా దినేష్ రెడ్డి 100 పర్సంటైల్ సాధించారు. బీఈ, బీటెక్ విద్యార్ధులకు నిర్వహించిన పేపర్ 1 పరీక్షలో ఈ ఏడుగురు 100 పర్సంటైల్ సాధించి రికార్డు నెలకొల్పారు. దేశవ్యాప్తంగా ఇంత మంది విద్యార్ధులు ఒక రాష్ట్రం నుంచి 100 పర్సంటైల్ సాధించడం కూడా ఇదే.

IIT JEE Mains 2024: telangana creates record of highest students got 100 percentile in india0

జేఈఈ మెయిన్ పరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా టాపర్ల జాబితా తయారవుతుంది. జేఈఈ ప్రధాన స్కోర్లు, టాపర్‌ల ర్యాంక్‌లు సరైన సమాధానాలకు +4, తప్పు సమాధానాలకు -1 మార్కింగ్ ఆధారంగా లెక్కిస్తారు. వివిధ సెషన్లలో జరిగిన పరీక్ష కష్టతరమైన స్థాయిలలో తేడాలను లెక్కించడానికి సాధారణీకరణ ప్రక్రియ ఉంటుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షకు గతేడాదితో పోలిస్తే 27 శాతం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 12 లక్షల 31 వేల 874 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1 పరీక్షకు దేశవ్యాప్తంగా 95.8 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+