IIT: ఐఐటీల సంచలన నిర్ణయం-ఏ క్యాంపస్ అయినా-ఈ ఏడాది నుంచే..!
ఐఐటీ సీటు పొందిన విద్యార్దులు ఇకపై తాము ఏ క్యాంపస్ తీసుకున్నా దానికి బదులుగా మరో క్యాంపస్ లో చదువు పూర్తి చేసుకుని తిరిగి ఆయా క్రెడిట్స్ తో సొంత సంస్దకు వచ్చి సర్టిఫికెట్ తీసుకోవచ్చు.
ప్రస్తుతం మన దేశంలో ప్రీమియర్ విద్య సంస్దలుగా ఉన్న ఐఐటీ (IIT)ల్లో సీటు సంపాదించాలంటే గగనం. లక్షల మందితో పోటీ పడి సీటు సంపాదించిన తర్వాత కూడా చదువుకోవాలంటే ఎక్కడెక్కడో ఉన్న క్యాంపస్ లకు వెళ్లాల్సిందే, అక్కడ ఉండే పరిస్ధితుల్ని తట్టుకోవాల్సిందే. కాదంటే ఐఐటీ డిగ్రీ అందుకోవడం కష్టం. ఇలాంటి పరిస్ధితుల్లో ఐఐటీలు ఓ చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి. అదే క్యాంపస్ మొబిలిటీ. విద్యార్ధులు తమకు కావాల్సిన క్యాంపస్ ఎంచుకునే విధానం.
దేశంలోని అగ్రశ్రేణి ఇంజినీరింగ్ సంస్థల విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరం నుండి తొలిసారి వివిధ ఐఐటీ క్యాంపస్‌లలో చదువుకోవచ్చని ఐఐటీ మద్రాస్ ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఈ విధానంలో విద్యార్థులు కొన్ని కోర్సులను లేదా పూర్తి సెమిస్టర్‌ను ఇతర ఐఐటీలో చదువుకోవచ్చు. అక్కడ వారు పొందిన క్రెడిట్‌లు వారి సొంత క్యాంపస్ కు సులభంగా బదిలీ అవుతాయి. ఇది కఠినమైన ర్యాంక్-ఆధారిత స్కీమ్ ల కంటే భిన్నమైనది.

ప్రస్తుతం అంతర్జాతీయ స్ధాయిలో జరుగుతున్న విద్యార్ధుల మార్పిడి కార్యక్రమాల తరహాలో ఉంటుంది. అయినప్పటికీ ఐఐటీ వ్యవస్థలోనే కొనసాగుతుంది. వివిధ ఐఐటీలలోని అనేక కోర్సుల పాఠ్యాంశాలను మ్యాప్ చేస్తున్నామని, ఇది పూర్తయిన తర్వాత, ఐఐటీ మద్రాస్ విద్యార్థులు వేరే ఐఐటీలో ఒక సెమిస్టర్ గడపవచ్చని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి తెలిపారు. అలాగే ఐఐటీ కాన్పూర్, ఢిల్లీ లేదా ఇండోర్ విద్యార్థులు మద్రాస్ క్యాంపస్‌లో కొన్ని కోర్సులు చేసి క్రెడిట్‌లు సంపాదించవచ్చని వెల్లడించారు. ఆయా క్రెడిట్ లను తాము వారి సొంత క్యాంపస్ కు బదిలీ చేస్తామన్నారు.

ర్యాంకుల ఆధారంగా క్యాంపస్ లు ఎంచుకునే ప్రస్తుత కఠిన విధానంతో పోలిస్తే ఇది చాలా సులువు. విద్యార్ధులకు మంచి విద్యానుభవం లభిస్తుందని భావిస్తున్నట్లు ఐఐటీ మద్రాస్ తెలిపింది. అకడమిక్ డీన్‌లు సహకరించుకుంటూ పనిచేస్తూ, అప్రూవల్స్ ప్రక్రియను సులభతరం చేస్తూ విద్యార్థులకు మరింత ఎంపిక, చలనశీలత, బహుళ-విషయాల అభ్యాస అవకాశాలను అందిస్తుందని ఐఐటీ మద్రాస్ పేర్కొంది. ఒక ర్యాంక్‌తో విద్యార్థులు ఇప్పుడు అనేక క్యాంపస్‌లకు ప్రవేశం పొంది, అపరిమిత అవకాశాలను పొందవచ్చు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications