అమెరికా, బ్రిటన్, కెనడాకు తగ్గిపోతున్న భారతీయ విద్యార్ధులు-కొత్త ఆప్షన్స్ ఇవే..!

గతంలో అమెరికా అంటే ఓ మోజు.. బ్రిటన్, కెనడా అంటే మరో మోజు.. అక్కడికి వెళ్లి చదువుకుంటేనే చదువులు అన్నట్లుగా స్వదేశాన్ని వదిలి ఆయా దేశాలకు పరుగులు తీసిన భారతీయ విద్యార్ధులు ఇప్పుడు మాత్రం నో అంటున్నారట. వీటి స్ధానంలో కొత్త ఆప్షన్స్ వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నారట. ఈ విషయం ఏ సర్వేనో చెప్పింది కాదు స్వయంగా కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ లోనే వెల్లడించింది.

విదేశీ విద్యపై తగ్గుతున్న మోజు

ముస్లింలీగ్ ఎంపీ ఈటీ మొహమ్మద్ బషీర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుకాంత మజుందార్ విదేశీ విద్యార్ధుల ట్రెండ్ పై కీలక వివరాలు వెల్లడించారు. ఇందులో గత మూడేళ్లలో విదేశాలకు వెళ్లే విద్యార్ధుల ధోరణుల్లో వచ్చిన మార్పుల్ని ఆయన గణాంకాలతో సహా వివరించారు. కేంద్రమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం 2022లో 7,50,365 మంది భారతీయులు విదేశాలలో చదువుతుండగా..2023లో ఈ సంఖ్య 8,92,989కి పెరిగింది. కరోనా తర్వాత ఇలా పెరిగింది. అయితే 2024లో మాత్రం ఇది 7,59,064కి పడిపోయింది. అంటే ఏకంగా 15 శాతం తగ్గిపోయింది.

Indian students prefer France Germany Russia New zealand than US UK Canada and Australia

కెనడా వద్దే వద్దంటున్న విద్యార్ధులు

ముఖ్యంగా కెనడాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఈ సంఖ్య 2023లో 2,33,532 నుండి 2024లో 1,37,608కి తగ్గిందని కేంద్రం తెలిపింది. ఇది ఏకంగా 41 శాతం తగ్గుదల కావడం విశేషం.
గతేడాది విద్యార్థి వీసా నిబంధనలను కఠినతరం చేయాలనే కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఇది వీసా తిరస్కరణ రేట్లు పెరగడానికి, దరఖాస్తుల పరిశీలనను కఠినతరం చేయడానికి, అధ్యయన అనుమతులను రద్దు చేయడానికి కారణమైంది. అలాగే భారత్-కెనడా దేశాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ తగ్గుదల కనిపించింది.

అమెరికాకు తగ్గిన భారతీయ విద్యార్ధులు

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో చదువుకోవడానికి వెళ్లే భారతీయుల సంఖ్య కూడా తగ్గింది.అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 2023లో 2,34,473 నుండి 2024లో 204,058కి తగ్గింది. ఇది 12.9 శాతం తగ్గుదలగా నమోదైంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అక్కడి విధానాల కారణంగా తలెత్తిన అనిశ్చితి దీనికి కారణమని భావిస్తున్నారు. దీని వల్ల గతేడాది చాలా మంది విద్యార్థులు అమెరికాలో చదువులపై వెనక్కి తగ్గారు.

బ్రిటన్, ఆస్ట్రేలియాపైనా తగ్గిన మోజు

బ్రిటన్ విషయానికొస్తే 2023లో 1,36,921 నుండి 2024లో 98,890కి విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇది 27.7 శాతం తగ్గుదలగా నమోదైంది. కఠినమైన వీసా నిబంధనల, పోస్ట్-స్టడీ వర్క్ విధానాల వల్ల ఈ సంఖ్య తగ్గినట్లు అంచనా. ఆస్ట్రేలియాలో విద్యార్థుల సంఖ్య కూడా 12 శాతం తగ్గిపోయింది. 2023లో 78,093 నుండి 2024లో 68,572కి తగ్గింది. వీసా ఫీజులు పెరగడం, కఠినమైన అవసరాలు, గృహ స్థోమతపై ఆందోళనలు, ఇటీవలి విధాన మార్పులే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
అలాగే చైనాకు ప్రయాణించే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది. ఈ సంఖ్య 2023లో 7,279 నుండి 2024లో 4,978కి తగ్గింది.

రష్యా,ఫ్రాన్స్,జర్మనీ,న్యూజిలాండ్ పై మోజు

గత మూడేళ్లలో రష్యాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉందని కేంద్రం వెల్లడించింది. 2022లో 19,784 మంది విద్యార్థుల నుండి, 2023లో 23,503కి, 2024లో 31,444కి విద్యార్ధుల సంఖ్య పెరిగింది. అదేవిధంగా ఫ్రాన్స్‌కు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 2022లో 6,406 నుండి 2023లో 7,484కి పెరిగింది. అలాగే 2024లో 8,536కి చేరుకుంది.
జర్మనీలో కూడా భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2023లో 23,296, 2022లో 20,684తో పోలిస్తే 2024లో 34,702 మంది విద్యార్థులు అక్కడికి వెళ్లారు. న్యూజిలాండ్‌లోనుూ 2022లో 1,605 మంది విద్యార్థులతో పోలిస్తే 2024లో 7,297 మందికి పెరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+