JEE Main result 2024 Session 1: జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల విడుదల-స్కోర్ కార్డ్ ఇలా..
ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల అవుతున్నాయి. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేస్తోంది. ఇప్పటికే పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ కీని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష రాసిన అభ్యర్ధులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఫలితాల తర్వాత కటాఫ్ మార్కులు ఎలా ఉండబోతున్నాయనే దానిపైనా ఉత్కంఠ నెలకొంది.
ఇవాళ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పరీక్షకు సంబంధించిన ఫలితాలను jeemain.nta.ac.in వెబ్ సైట్ లో విడుదల చేస్తోంది. ఇందులోకి లాగిన్ అయి స్కోర్ కార్డు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.
అలాగే ఎన్టీఏ మరో వైబ్ సైట్ ntaresults.nic.in లోకి లాగిన్ అయ్యి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాల విడుదల తర్వాత రీవ్యాల్యూయేషన్ కానీ, ఫలితాల రీ చెకింగ్ కు కానీ అనుమతించరు.

పరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జేఈఈ మెయిన్ టాపర్ల జాబితాను తయారు చేస్తారు. జేఈఈ ప్రధాన స్కోర్లు, టాపర్‌ల ర్యాంక్‌లు సరైన సమాధానాలకు +4, తప్పు సమాధానాలకు -1 మార్కింగ్ ఆధారంగా లెక్కిస్తారు. పరీక్ష యొక్క వివిధ సెషన్లలో కష్టతరమైన స్థాయిలలో తేడాలను లెక్కించడానికి సాధారణీకరణ ప్రక్రియ అమలు చేస్తారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షకు గతేడాదితో పోలిస్తే 27 శాతం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది మొత్తం 12 లక్షల 31 వేల 874 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే పేపర్ 1 పరీక్షకు దేశవ్యాప్తంగా 95.8 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.
కటాఫ్ ల విషయానికొస్తే.. రెండు రకాలుగా నిర్ణయిస్తారు. ఇందులో ఒకటి క్వాలిఫయింగ్ కటాఫ్. దీన్ని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయిస్తుంది. అలాగే రెండవది అడ్మిషన్ కటాఫ్. దీన్ని అడ్మిషన్లు ఇచ్చేందుకు అందుబాటులో ఉన్న సంస్ధల తరఫున జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జేఓఎస్ఏఏ) నిర్ణయిస్తుంది. కేటగిరీల వారీగా కటాఫ్ లు నిర్ణయిస్తారు. ఈసారి జేఈఈ మెయిన్ 2024 కటాఫ్ జనరల్ కేటగిరీకి 90 ప్లస్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఓబీసీ-ఎన్సీఎల్ కేటగిరీకి 75 ప్లస్, ఈడబ్ల్యూఎస్ 78 ప్లస్, ఎస్సీలకు 44 ప్లస్, పీడబ్లూడీకి 0.11 ప్లస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications