KVS Class 1 Admissions 2024-25:కేంద్రీయ విద్యాలయాల్లో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లు ప్రారంభం-వివరాలివే..!
కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అయిన కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతికి అడ్మిషన్లు తీసుకునేందుకు కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ ప్రకటన విడుదల చేసింది. ఇందులో కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియ, విద్యార్దులకు ఉండాల్సిన అర్హతలు, ఇతర వివరాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రిజర్వేషన్లు వీటికి వర్తిస్తాయి.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2024-25 విద్యా సంవత్సరానికి కేవీల్లో మొదటి తరగతి అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించింది. కేవీ పాఠశాలల్లో విద్యనభ్యసించాలనుకునే విద్యార్దులు వీటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. ఇందులోనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే మార్చి 27 నుంచి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచుతారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 1247 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో లక్షలాది మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నియమించే అనుభవజ్ఞులైన టీచర్ల ద్వారా అత్యుత్తమ విద్యను అందుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు కేవీల్లో ఆడ్మిషన్లను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల విద్యార్ధులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి కేవీల్లో అడ్మిషన్లకు పోటీ పడాల్సి ఉంటుంది.
ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. అనంతరం మే నెలలో ఫలితాలు విడుదల చేస్తారు. అనంతరం రిజర్వేషన్లు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. కేవీల్లో చేరాలనుకునే విద్యార్దులు భారతీయులై ఉండాలి. కనీసం ఆరేళ్ల వయస్సు ఉండాలి. అడ్మిషన్ల కోసం సమర్పించే డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ అయి ఉండాలి.
కేవీల్లో ఒకటో తరగతి అడ్మిషన్లు కావాలనుకునే వారు అధికారిక వెబ్ సైట్ kvsonlineadmission.kvs.gov.inని సందర్శించాలి. అక్కడ న్యూ రిజిస్టర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అన్ని వివరాలను జాగ్రత్తగా నమోదు చేసి, రిజిస్టర్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ ప్రివ్యూను తీసుకుని, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్ సేవ్ చేసుకుని ఉంచుకోవాలి.












Click it and Unblock the Notifications