మంగళగిరిలో నారా లోకేష్ మెగా జాబ్ మేళా-ఉద్యోగాలు, అర్హతలు ఇతర వివరాలివే..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ ఇచ్చింది. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్దితి గమనించి ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకోవడానికి ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు వరుసగా జాబ్ మేళాల నిర్వహణకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఏపీ విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరి నుంచే వీటిని ప్రారంభిస్తున్నారు.

ఈ నెల 24న అంటే వచ్చే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మంగళగిరిలోని వీటీజేఎం-ఐవీటీఆర్ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాకు కనీస విద్యార్హత ఏదీ లేదు. 0 నుంచి పీజీ వరకూ ఏ అర్హత ఉన్నా ఇందులో హాజరు కావొచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. 50కి పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, ఐదు వేలకు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని ఓ ప్రకటన విడుదల చేశారు.

nara lokesh organising job mela in mangalagiri on nov 24- here are details

మంగళరిలో నిర్వహించే ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనదలిచిన వారికి ఇతర వివరాలు అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్లను, రిజిస్ట్రేషన్ల కోసం క్యూఆర్ కోడ్ ను కూడా షేర్ చేశారు. అభ్యర్ధుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు 9642333668, 9030047303ను అంందుబాటులో ఉంచారు.

nara lokesh organising job mela in mangalagiri on nov 24- here are details

అలాగే కంపెనీల హెచ్ ఆర్ కోసం మరో హెల్ప్ లైన్ నంబర్ 8886111981ను కూడా అందుబాటులో ఉంచారు. రిజిస్ట్రేషన్ల కోసం గూగుల్ డాక్స్ ఫామ్ ను, క్యూఆర్ కోడ్ తో అంందుబాటులో ఉంచారు. కాబట్టి మంగళగిరి, చుట్టు పక్కల ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+