NEET Paper Leak 2026: మళ్లీ నీట్ పేపర్ లీక్ అయిందా ?

ఈ ఏడాది జాతీయ స్దాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష (NEET UG 2026) ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. దీంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్ధుల భవిత ప్రశ్నార్ధకంగా మారింది. రాజస్థాన్ లో జరిగిన ఈ లీక్ ప్రభావం దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్ధుల మీద పడటంతో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను రద్దు చేయడంతో పాటు ఈ నెల 21న మరోసారి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈసారి కూడా నీట్ పేపర్ లీక్ అయిందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీంతో మరోసారి విద్యార్ధులు, వారి తల్లితండ్రుల్లో కలవరం మొదలైంది.

నీట్ రీటెస్ట్ (NEET retest 2026) పరీక్షకు మరో వారం రోజులే మిగిలున్న నేపథ్యంలో మరోసారి పేపర్ లీక్ అయిందన్న వార్తలతో విద్యార్ధులు టెన్షన్ పడుతుండటంతో దీనిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ పీఐబీ స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సమాచారం ఫేక్ అని పీఐబీ తేల్చేసింది. నీట్ రీటెస్ట్ కు సంబంధించి అభ్యర్ధులు ఎలాంటి నిర్ధారణ కాని సమాచారాన్ని నమ్మొద్దని, షేర్ చేయొద్దని, ఆధారపడొద్దని పీఐబీ ఎక్స్ లో చేసిన ట్వీట్ లో విజ్ఞప్తి చేసింది.

NEET Paper Leak 2026 PIB Fact Check Calls Viral Claim False

నీట్ రీటెస్ట్ కు సంబంధించిన అధికారిక సమాచారం కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్ సైట్ neet.nta.nic.in ను సంప్రదించాలని పీఐబీ అభ్యర్ధులను కోరుతోంది. అలాగే నీట్ రీటెస్ట్ పై అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తోంది. ఇందుకోసం పీఐబీ వాట్సాప్ నంబర్ +91 8799711259 తో పాటు ఈ మెయిల్ అడ్రస్ [email protected] ను కూడా షేర్ చేసింది. కాబట్టి నీట్ రీటెస్ట్ రాసే విద్యార్ధులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని పీఐబీ విజ్ఞప్తి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+