NEET UG 2026 Answer Key: నీట్ ఆన్సర్ కీ విడుదల తేదీ- డౌన్ లోడ్ ఇలా..!
ఎట్టకేలకు నీట్ యూజీ రీటెస్ట్ (NEET UG Retest 2026) పూర్తయింది. దీంతో ఈసారి పరీక్ష రాసిన అభ్యర్ధులంతా ఆన్సర్ కీ కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలు వెలువడటానికి ముందే ఆన్సర్ కీ విడుదల అవుతుంది కాబట్టి ఇందులో తాము రాసిన సమాధానాల ఆధారంగా ఎన్ని మార్కులు రాబోతున్నాయనే విషయంపై వారికి క్లారిటీ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల కోసం ఏర్పాట్లు చేస్తోంది.
జూన్ 21న నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష మరో మూడు నుంచి ఐదు రోజుల్లో విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఎన్టీఏ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఎన్టీఏ దీనికి సంబంధించి అధికారికంగా తేదీని ప్రకటించినప్పటికీ జూన్ 24 సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రొవిజనల్ ఆన్సర్ కీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల 'రెస్పాన్స్ షీట్ల'ను (పరీక్షలో వారు నమోదు చేసిన సమాధానాల పత్రాలు) కూడా ఎన్టీఏ విడుదల చేసే అవకాశం ఉంది. దీనివల్ల అభ్యర్థులు తాము రాసిన సమాధానాలను అధికారిక సమాధానాలతో సరిపోల్చుకునే వీలు ఉంటుంది.

సెట్ 50, 60, 70, 80లతో సహా అన్ని ప్రశ్నపత్రాల సెట్‌లకు సంబంధించిన ఆన్సర్ కీ పీడీఎఫ్ లు ఎన్టీఏ విడుదల చేయనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి నేరుగా ఈ ఆన్సర్ కీని పొందవచ్చు. నీట్ ఆన్సర్ కీ విడుదల కాగానే అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించాలి. అభ్యర్థుల లాగిన్ పేజీని తెరవాలి. అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. రెస్పాన్స్ షీట్, తాత్కాలిక ఆన్సర్ కీ కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం ఆ పత్రాలను డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోవాలి. తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసిన తర్వాత, అభ్యర్థుల కోసం అభ్యంతరాలను తెలియజేసే అవకాశాన్ని ఎన్టీఏ కల్పిస్తుంది. ఏదైనా లోపం ఉన్నట్లు లేదా ఏదైనా సమాధానం తప్పుగా ఉన్నట్లు విద్యార్థులు భావిస్తే, నిర్ణీత గడువులోగా తగిన ఆధారాలతో దాన్ని సవాలు చేసే అవకాశం వారికి ఉంటుంది. అభ్యర్థులు సమర్పించిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణులు పరిశీలిస్తారు. వారి సిఫార్సుల ఆధారంగా, తుది ఆన్సర్ కీని ప్రచురించే ముందు ఎన్టీఏ అందులో మార్పులు చేస్తుంది.













Click it and Unblock the Notifications