NEET UG: నీట్ యూజీలో కీలక మార్పులు? రెండు దశల్లో పరీక్ష, వయో పరిమితి సహా..!

ఈ ఏడాది నీట్ యూజీ పరీక్ష (NEET UG Exam)లో చోటు చేసుకున్న అక్రమాలు దేశాన్ని కుదిపేశాయి. విద్యార్దుల నిరసనల ధాటికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నీట్ లో కీలక సంస్కరణలు చేపట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఈ మేరకు పార్లమెంటరీ కమిటీ చేసిన సూచనలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా పేపర్ లీక్ లకు అడ్డుకట్ట వేయడం, ఎన్టీఏపై పార్లమెంట్ పర్యవేక్షణ పెంచేందుకు చట్టం తీసుకురావడం వంటివి ఇందులో ఉన్నాయి.

నీట్ లో కీలక మార్పులు (NEET)

ప్రస్తుతం నిర్వహిస్తున్న పెన్ అండ్ పేపర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షల (CBT) విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని కమిటీ సూచించింది. ప్రవేశ పరీక్షల నిర్వహణలో ప్రైవేట్ కేంద్రాలపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే పరీక్షా కేంద్రాలను విస్తృతంగా వినియోగించాలని పేర్కొంది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాల్ని ఎదుర్కోవాలంటే ఎన్‌టీఏలో తగినంత సిబ్బంది, పటిష్టమైన భద్రతా విధానాలు, స్పష్టమైన జవాబుదారీతనం, డిజిటల్ వ్యవస్థలు అవసరమని తెలిపింది. ప్రస్తుతం నీట్ యూజీ పరీక్షకు ఎన్నిసార్లయినా హాజరయ్యే అవకాశం ఉండటం, గరిష్ఠ వయోపరిమితి కూడా లేకపోవడాన్ని తప్పుబట్టింది. నీట్ యూజీ సహా ప్రధాన ప్రవేశ పరీక్షలకు సహేతుకమైన గరిష్ఠ వయోపరిమితి, ప్రయత్నాల పరిమితులను విధించే అవకాశాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతో కలిసి పరిశీలించాలని విద్యాశాఖకు సూచించింది. యూజీసీ-నెట్‌కు మాత్రం మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొంది.

NEET UG Reforms Panel Seeks NTA Accountability Government Exam Centres and Two-Stage Tests

రెండు దశల్లో నీట్ యూజీ పరీక్ష

ప్రస్తుతం ఒకే దశలో నిర్వహిస్తున్న నీట్ యూజీ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఏటా 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో, రెండు దశల విధానాన్ని పరిశీలించాలని కమిటీ సూచించింది. అన్ని వైద్య విద్యా విభాగాలకు ఉమ్మడి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత ఎంబీబీఎస్, నర్సింగ్, ఆయుష్ వంటి కోర్సులకు ప్రత్యేక ప్రధాన పరీక్షలు నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని పేర్కొంది. దీనివల్ల వేర్వేరు కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థుల మధ్య అనవసర పోటీని తగ్గించవచ్చని అభిప్రాయపడింది. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే లేదా నిబంధనలు ఉల్లంఘించే సంస్థల వివరాలతో జాతీయ స్థాయి బ్లాక్‌లిస్ట్‌ను రూపొందించి నిర్వహించాలని ఎన్‌టీఏకు సూచించింది.

ప్రశ్నాపత్రాల్లో మార్పులు

పేపర్ లీక్‌లను అడ్డుకునేందుకు విస్తృతమైన, వైవిధ్యభరితమైన ప్రశ్నల బ్యాంకును అభివృద్ధి చేయాలని పేర్కొంది. ఒకే ప్రశ్నపత్రాలను పదేపదే ఉపయోగించడం లేదా ప్రతి ఏడాది కొత్త ప్రశ్నపత్రాలను రూపొందించే పరిమిత విధానంపై ఆధారపడటం పరీక్షల విశ్వసనీయతకు ప్రమాదకరమని తెలిపింది. ఐఐటీలు, ఎయిమ్స్, ఐఐఎంలు వంటి ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన నిపుణుల సేవలను ప్రశ్నల బ్యాంకు రూపకల్పన, అనువాదం కోసం వాడుకోవాలని సూచించింది. నిపుణులను నియమించే ముందు వారి గత చరిత్ర, నిజాయితీ, ప్రయోజనాల సంఘర్షణకు సంబంధించిన అంశాలను పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది. పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా చేరుకునే విద్యార్థులు తమ నుంచి రాతపూర్వక హామీ తీసుకున్న అనంతరం పరీక్షకు అనుమతించే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని సూచించింది.

NEET UG Reforms Panel Seeks NTA Accountability Government Exam Centres and Two-Stage Tests

ఎన్టీఏలో సంస్కరణలు

ఎన్‌టీఏలో సిబ్బంది కొరతపై కూడా పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సంస్థలో మొత్తం 39 మంజూరైన పోస్టులకు గాను ప్రస్తుతం 23 మంది మాత్రమే విధుల్లో ఉన్నారని, దీంతో 41 శాతం ఖాళీలు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ఎన్‌టీఏకు అవసరమైన సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కమిటీ సూచించింది. ముఖ్యంగా పరీక్షల విశ్లేషణ, సైకోమెట్రిక్స్, పరీక్షల భద్రత, డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా విశ్లేషణ, పరీక్షల నిర్వహణ వంటి విభాగాల్లో నిపుణులను నియమించాలని పేర్కొంది. కేంద్ర సిబ్బంది పథకం ద్వారా వచ్చే అధికారులను అదనపు ఉన్నతస్థాయి నాయకత్వంగా మాత్రమే వినియోగించాలని, వారిపై మాత్రమే ఆధారపడకూడదని సూచించింది. దేశంలో పరీక్షల నిర్వహణలో పాల్గొనే ఉన్నతాధికారుల నుంచి పరీక్షా కేంద్రాల్లోని ఇన్విజిలేటర్ల వరకు ప్రతి ఒక్కరూ పరీక్షల సమగ్రతను కాపాడే బాధ్యతను తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల్లో విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పేందుకు పారదర్శకమైన సమాచార వ్యవస్థ, నిరంతర సంప్రదింపులు అవసరమని పేర్కొంది. సురక్షితమైన ప్రభుత్వ కంప్యూటర్ ఆధారిత పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఎన్‌టీఏను కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+