New Labour Laws: ఊహించని మార్పు, జాబ్స్ పెరిగాయ్!
గతంలో ఉద్యోగం అంటే కేవలం హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాలే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. బ్లూ, గ్రే-కాలర్ ఉద్యోగాల కోసం వెతికే వారికి ఇప్పుడు చిన్న నగరాలు (Tier-3, Tier-4 cities) కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. కొత్త కార్మిక చట్టాల అమలు మరియు వ్యాపార సంస్థల విస్తరణ కారణంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో నియామకాలు ఊపందుకున్నాయని 'వర్క్‌ఇండియా' నివేదిక స్పష్టం చేసింది.
మెట్రో నగరాల కంటే చిన్న పట్టణాల్లోనే ఉద్యోగాల కల్పన వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని నగరాల్లో నియామకాలు ఏకంగా 56% వరకు పెరగడం విశేషం. ఆయా నగరాల వారీగా వృద్ధి రేటు ఇలా ఉంది

- కొల్హాపుర్- 56.3%
- ఉదయపుర్- 55.3%
- గోవా -23.6%
- విజయవాడ -20.2%
- కోచి -17.7%
- కోయంబత్తూరు - 14.1%
New Labour Laws: భయాలు పటాపంచలు!
కొత్త కార్మిక చట్టం అమలులోకి వస్తే నియామకాలు తగ్గుతాయని అందరూ భావించారు. కానీ వాస్తవం మరోలా ఉంది. చట్టం అమలు తర్వాత మొత్తం నియామకాలు 8.4% పెరిగాయి. ఈ నివేదిక కోసం వర్క్‌ఇండియా సంస్థ అక్టోబర్ 2025 నుండి జనవరి 2026 వరకు ఉన్న డేటాను విశ్లేషించింది. మెట్రో నగరాల్లో కూడా (అహ్మదాబాద్‌లో 19.2%, పుణెలో 13.2%) స్థిరమైన వృద్ధి కనిపిస్తోంది.
ఈ నివేదికలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు:
- మహిళా నియామకాలు: పురుషుల ఉద్యోగాల వృద్ధి 6.3% ఉండగా, మహిళల నియామకాలు 10% పెరిగాయి.
- వర్క్ ఫ్రమ్ హోమ్ (WFM) తగ్గుముఖం: ఇంటి నుంచి పని చేసే ఉద్యోగాలు 10.4% తగ్గగా, ఆఫీసు నుంచి పని చేసే (Work from office) నియామకాలు 8.7% పెరిగాయి.
- స్థిరమైన డిమాండ్: చిన్న నగరాల్లో వేగం ఎక్కువగా ఉన్నా, ముంబై (8.8%), కోల్‌కతా (8.9%) వంటి ప్రధాన నగరాల్లో డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది.
Artificial Intelligence: మహిళా ఉద్యోగులకు శాపం, బలి అవుతుంది వీరే!
వ్యాపారాలు మెట్రోల నుంచి జిల్లాలకు విస్తరిస్తుండటం వల్ల స్థానిక యువతకు సొంత ప్రాంతాల్లోనే మెరుగైన ఉపాధి లభిస్తోంది. ముఖ్యంగా బ్లూ కాలర్ (నైపుణ్యం కలిగిన కార్మికులు), గ్రే కాలర్ (సర్వీస్ సెక్టార్) రంగాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications