రూ. 60 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు.. DON'T MISS !
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశమని చెప్పొచ్చు. ఏపీ ప్రణాళికా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన, ప్రభుత్వ P4 కార్యక్రమాల సమన్వయం కోసం ఈ నియామకాలు చేపడుతున్నారు. మొత్తంగా 175 "యంగ్ ప్రొఫెషనల్స్"ను ఏడాది కాలానికి కాంట్రాక్ట్ విధానంలో నియమించనున్నారు. అవసరాన్ని బట్టి పనితీరును ఆధారంగా చేసుకొని ఈ కాలాన్ని మరింత పెంచే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఈ ప్రొఫెషనల్స్ విధులు నిర్వర్తించనున్నారు.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
జీతం..
నెలకు రూ.60,000.
ఎంపిక విధానం..
విద్యార్హతలు, రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
వయస్సు..
అభ్యర్థులు 2025 మే 1 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్‌లో https://apsdpscareers.com/YP.aspx వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేయాలి.
మొత్తం ఖాళీలు..
175












Click it and Unblock the Notifications