NEET-UG Counseling: నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా-ఎల్లుండి తేల్చనున్న సుప్రీంకోర్టు..!

ఈ ఏడాది దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీక్, ఇతర అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇన్నాళ్లూ మొండిగా వ్యవహరిస్తూ వచ్చిన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇవాళ మాత్రం వెనక్కి తగ్గింది.

ఇవాళ జరగాల్సిన నీట్ యూజీ కౌన్సెలింగ్ ను నిరవధికంగా వాయిదా వేసింది. దీనిపై త్వరలో తదుపరి నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు నీట్ యూజీ పరీక్షపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎల్లుండి మరోసారి విచారణ జరపబోతోంది.

NTA Postpones NEET-UG Counseling ahead of supreme court hearing on July 8

వాస్తవానికి నిన్న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ నీట్ యూజీ కౌన్సెలింగ్ ను వాయిదా వేసేందుకు నిరాకరించింది. ఇది ఓపెన్ అండ్ షట్ ప్రక్రియ కాదని వ్యాఖ్యానించింది. నీట్ అక్రమాలపై దాఖలైన పిటిషన్లపై మరోసారి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ.. నీట్ యూజీ కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

అయితే నిన్నటి విచారణలో కౌన్సెలింగ్ ప్రక్రియను రెండు రోజుల పాటు ఆపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది బెంచ్‌ను కోరారు. దీనిపై బెంచ్ ఓ నిర్ణయం తీసుకోవాలని ఎన్టీఏకు సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ ఇవాళ నీట్ కౌన్సెలింగ్ ను సోమవారం వరకూ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్, ఇతర అక్రమాలపై సీబీఐ విచారణ జరుపుతోంది. దీంతో సోమవారం విచారణలో సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+