తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు తొలగిన అడ్డంకి

తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్ -1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.

దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని జారీ చేసింది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Obstacle removed for Telangana Group-1 recruitments

తాజాగా, పిటిషన్ కొట్టివేతతో గ్రూప్1 నియామకాలకు అడ్డంకి తొలగినట్లయింది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనుంది.

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23న నిర్వహించిన ప్రవేశపరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు టీజీసెట్‌-2025 చీఫ్‌ కన్వీనర్‌ అలుగు వర్షిణి ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓసీ క్యాటగిరీలకు చెందిన 36,334 మందికి సీట్లు లభించాయని తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలకు 89,246 మంది దరఖాస్తు చేసుకోగా.. 84,672 మంది పరీక్షకు హాజరైనట్టు చెప్పారు. 5వ తరగతిలో మొత్తం 51,408 సీట్లు ఉండగా, ఇదివరకే ప్రత్యేక కేటగిరీ కింద 1944 సీట్లను భర్తీ చేశామని, మిగిలిన 13,130 సీట్లను వివిధ క్యాటగిరీల నుంచి దశలవారీగా భర్తీ చేస్తామని చీఫ్ కన్వీనర్ వర్షిణి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+