Education News: గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీ తీసున్న PhD స్కాలర్.. తర్వాత చేసిన పనికి అందరూ షాక్..

Tamilnadu News: సాధారణంగా విద్యార్థులు అంటే కాలేజ్‌లో మంచిగా చదువుకున్నామా, కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్లామా అన్నట్లు ఉంటారు. కానీ కొందరు మాత్రం తాము పడిన ఇబ్బందులు తమ తరువాతి వారు పడకుండా ఉండేందుకు తపిస్తారు. భవిష్యత్ తరాలకు మార్గం సుగమం చేస్తూ చరిత్రలో నిలిచిపోతారు. స్వార్థంలో నిండిన ఈ ప్రపంచంలో మనకెందుకులే అనుకోకుండా చేతనైనంతలో జూనియర్లకు సాయం చేస్తుంటారు. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ సంఘటన యావత్ దేశాన్ని ఆలోచింపచేస్తోంది.

భారతీయార్ యూనివర్శిటీకి చెందిన ఒక పీహెచ్‌డీ స్కాలర్ యూనివర్సిటీ 39వ స్నాతకోత్సవం సందర్భంగా తన డిగ్రీని స్వీకరించడానికి స్టేజ్‌పైకి వెళ్లాడు. తమిళనాడు గవర్నర్ RN రవి చేతులమీదుగా దాన్ని తీసుకున్నాడు. ఆ వెంటనే తన చేతిలోని లేఖను గవర్నర్‌కు అందించాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారందరూ షాక్‌ అయ్యారు. ఆ లేఖ ద్వారా యూనివర్సిటీలోని రీసెర్చ్ స్కాలర్‌లు మరియు విద్యార్థుల కష్టాలను సాక్ష్యాత్తు గవర్నర్‌కే ఏకరువు పెట్టాడు. క్యాంపస్‌లో వారు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను నివేదించాడు. పలువురు అధ్యాపకులు విద్యార్థుల పట్ల ప్రవర్తిస్తున్న అమానవీయ తీరును ఎండగట్టాడు.

PhD scholar complaint letter to governer after receiving degree in convocation

'భారతీయార్ విశ్వవిద్యాలయంలోని రీసెర్చ్ స్కాలర్లు మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు' అనే శీర్షికతో ఆంగ్లంలో PhD చేస్తున్న ప్రకాష్ ఓ లేఖ రాశాడు. కొంతమంది గైడ్‌లు రీసెర్చ్ స్కాలర్‌లను విద్యార్థులుగా చూడరని, గిన్నెలు కడగడం మరియు వారి పిల్లల ఆలనాపాలనా చూసుకునే ఆయాలుగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాంకు ఖాతాల నిర్వహణ నుంచి వారి సొంత గృహ బాధ్యతలను తమపై రుద్దుతారని ఆక్షేపించాడు. ఇంత చేసినా వారి నుంచి పూర్తిస్థాయిలో సహకారం లభించదని పేర్కొన్నాడు.

షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు నెలవారీ మెస్ ఫీజుల విషయంలో ఆర్థిక భారం పడుతుందని గవర్నర్‌కు విన్నవించాడు. బహిరంగంగా నిర్వహించబడుతున్న ఆది ద్రావిడర్ హాస్టళ్ల గురించి కూడా తన లేఖలో ప్రస్తావించాడు. కొంతమంది గైడ్‌లు తమ వైవా సమయంలో 50 వేల నుంచి లక్ష వరకు డిమాండ్ చేస్తారని ఆరోపించాడు. పరీక్షల్లో విజయం అనంతరం మరికొందరు గైడ్‌లకు డబ్బు, పార్టీలతోపాటు బంగారం గిఫ్ట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు తన లేఖ ద్వారా చెప్పుకొచ్చాడు.

స్పోర్ట్స్ డే కోసం విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసినప్పటికీ గత నాలుగేళ్లలో విశ్వవిద్యాలయం అలాంటి ఈవెంట్‌లను నిర్వహించలేదని ఫిర్యాదులో ప్రకాష్ హైలెట్ చేశాడు. విద్యార్థులు క్రీడా సౌకర్యాలను ఉపయోగించకుండా సిబ్బంది ఆంక్షలు విధిస్తున్నారని తెలిపాడు. అయితే వాటిని వారాంతంలో బయటి వ్యక్తులకు అద్దెకు ఇస్తున్నారనే సత్యాన్ని బయటపెట్టాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+