Teacher suspension: ఈ టీచర్ నిర్వాకానికి స్పాట్‌లో సస్పెన్షన్.. లబోదిబోమంటున్న పేరెంట్స్
Rajasthan News: మంచిగా చదువు చెప్పి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులపై ఇటీవల పలు ఆరోపణలు వస్తున్నాయి. మంచి మార్కులు రాకపోవడంతో ఒత్తిడిని తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. విద్యార్థుల పేపర్ కరెక్షన్స్ చేసే టీచర్స్ ఈ తరహా ఘటనలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ రాజస్థాన్‌కు చెందిన ఓ ఉపాధ్యాయురాలి నిర్వాకం తెలిసి పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజస్థాన్ విద్యా శాఖలో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయురాలు నిర్మిషా రాణి 10వ తరగతి బోర్డ్ పరీక్షకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యాంకనానికి హాజరయ్యారు. అయితే విద్యార్థులు రాసిన సమాధానాలను పరిశీలించకుండానే తనకు తోచిన మార్కులను వేసినట్లు తేలడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఘటనకు కారకురాలైన టీచర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

అజ్మీర్ జిల్లా భగవాన్ గంజ్ లోని మహాత్మా గాంధీ ప్రభుత్వ పాఠశాలలో సదరు ఉపాధ్యాయురాలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సమాధాన పత్రాలను సమీక్షించకుండా ఇష్టం వచ్చిట్లు మార్కులు వేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని, తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందనే ఆరోపణలతో విద్యాశాఖ వెంటనే చర్య తీసుకుంది. కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా శాఖా స్థాయిలో విచారణ జరపాలని విద్యాశాఖ మంత్రి మదన్ దిలావార్ ఆదేశించారు.
2002లో జరిగిన గోద్రా ఘటన పాఠ్యాంశం ప్రింట్ కాబడిన పుస్తకం సహా మొత్తం నాలుగు టెక్స్ట్ బుక్స్‌ను రాజస్థాన్ ప్రభుత్వం తిరిగి రప్పించింది. సాంకేతిక లోపాలు కారణంగా కాగితం మరియు ప్రింటింగ్ నాణ్యతను పరిశీలించడానికి పుస్తకాలు రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. జనాల్లో విద్వేషం నూరిపోసేందుకు ప్రజాధనాన్ని ఉపయోగించారని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications