రైల్వేలో 32 వేలకుపైగా ఉద్యోగాలు, వివరాలివే
రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రైల్వే రెక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఏకంగా 32,438 గ్రూప్ డీ ఉద్యోగల భర్తీ చేయనుంది. ఇందుకోసం లెవల్-1 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులు ఉన్నాయి.
మొత్తం 32,438 ఉద్యోగాలు ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ విభాగాల్లో ఉన్నాయి.
విద్యార్హతలు:
అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ అర్హతలతో పాటు, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు 2025 జులై 1 నాటికి 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఓబీసీ, పీహెచ్, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుం:
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. మహిళలు, ఈబీసీలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
జీతం వివరాలు:
గ్రూప్-డి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 వరకు జీతం ఇస్తారు. అదనంగా ఇతర భత్యాలు కూడా ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు:
సికింద్రాబాద్, చెన్నై, భువనేశ్వర్, బెంగళూరు, అహ్మదాబాద్, అజ్‌మేర్, భోపాల్, బిలాస్‌పూర్, ఛండీగఢ్, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, పాట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీలలో ఎక్కడైనా ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది.
కాగా, గ్రూప్-డి పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఎంపిక విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను ఆర్‌ఆర్‌బీ త్వరలో వెల్లడించనుంది.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదలైన తేదీ: 2024 డిసెంబర్ 28
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2025 జనవరి 23
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2025 ఫిబ్రవరి 22.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications