పేద విద్యార్దులకు ఎస్‌బీఐ గోల్డెన్ ఛాన్స్.. రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం !!
భారతదేశంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ (SBI Foundation) తీపికబురు ప్రకటించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్స్, వైద్య విద్యార్థులు, ఐఐటీ, ఐఐఎం విద్యార్థులతో పాటు విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల కోసం ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2025-26 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఇందులో భాగంగా ఈ ఏడాది మొత్తం మీద 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఎస్‌బీఐ ఫౌండేషన్ సుమారు రూ.90 కోట్లు కేటాయించినట్టు స్పష్టం చేశారు. 2022లో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకు లక్షలాది మంది వెనుకబడిన విద్యార్థులు లబ్ధిపొందారు. ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ గురించి మరిన్ని వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

అర్హతలు..
తరగతులు: 9వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మార్కులు: సాధారణ కేటగిరీకి కనీసం 75% మార్కులు లేదా 7 సీజీపీఏ అవసరం.
ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు రాయితీ: 10% తగ్గింపు - కనీసం 67.5% మార్కులు లేదా 6.3 సీజీపీఏ ఉండాలి.
ఆదాయ పరిమితి..
కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుండి రూ.6 లక్షల వరకు మించకూడదు.
దరఖాస్తు చివరి తేదీ: 15 నవంబర్ 2025.
ఆర్థిక సాయం..
ఎంపికైన విద్యార్థులకు వారు చదివే కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.15 వేల నుండి రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందించనున్నారు. స్కూల్, కాలేజీ స్థాయిలో చదువుతున్న వారికి అందుకు తగిన ఆర్థిక సాయం ఇస్తారు. IIT, IIM, మెడికల్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు అధిక సాయం లభిస్తుంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది. కాగా ఈ స్కాలర్‌షిప్ ప్రతి సంవత్సరం రీన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
అందుకోసం విద్యార్థులు కనీస అటెండెన్స్ ప్రమాణం పాటించాలి. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులు సాధించాలి. ఈ ప్రమాణాలు నెరవేర్చినంత కాలం విద్యార్థులు కోర్సు పూర్తయ్యే వరకు స్కాలర్‌షిప్ పొందుతారు. అంతే కాకుండా ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మాత్రమే అందుబాటులో ఉంది.
దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ SBI Platinum Jubilee Asha Scholarship 2025 ను చేసక చేయవచ్చు. విద్యార్థులు దరఖాస్తు సమయంలో తమ మార్క్‌షీట్, ఆదాయ ధృవపత్రం, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాలి. విద్యలో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థులకు ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications