ఎస్బీఐ పీవో మెయిన్స్ ఫలితాలు విడుదల: ఇలా చూసుకోండి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన మెయిన్స్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన మెయిన్స్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తొలుత నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి జనవరి 30న మెయిన్స్ పరీక్ష జరిగింది.
ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల జాబితాను ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఫేజ్-3లో భఆగంగా నిర్వహించే సైకోమెట్రిక్ పరీక్షకు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను సెంట్రల్ రిక్రూట్ మెంట్ అండ్ ప్రొమోషన్ విభాగం వెల్లడించింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులు గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ లకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.

సెప్టెంబర్, 2022 లో ఎస్బీఐ 1673 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టుల్లో 1600 రెగ్యులర్ కాగా, 73 బ్యాక్ లాగ్ ఖాళీలున్నాయి. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను మొత్తం మూడు దశల్లో ఎంపిక చేయనున్నారు.
ఎస్బీఐ పీవో మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications