తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు.. భారీ జీతంతో !!
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (TGFSL)లో 60 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది.
ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను జనవరి 20 నుంచి జనవరి 31 వరకు నిర్వహించనున్నట్లు TSLPRB ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ వివరాలు..
ఈ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మొత్తం పది రోజుల పాటు కొనసాగనుంది. అభ్యర్థులు తప్పనిసరిగా తమకు కేటాయించిన తేదీ, సమయానికి హాజరుకావాలని అధికారులు సూచించారు.
అభ్యర్థులు తమ ఇంటిమేషన్ లెటర్‌ను జనవరి 19 అర్ధరాత్రిలోపు TSLPRB అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ లెటర్‌లో వెరిఫికేషన్ తేదీ, సమయం, వేదిక వివరాలు స్పష్టంగా ఉంటాయి.
తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు..
విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు
కుల ధ్రువపత్రం (వర్తించినట్లయితే)
వయస్సు ధ్రువపత్రం
దరఖాస్తు ఫారమ్ ప్రింట్ కాపీ
ఇంటిమేషన్ లెటర్
ఇతర అవసరమైన ఆధారాలు
తప్పనిసరిగా తీసుకెళ్లాలని బోర్డు సూచించింది.
రాత పరీక్షపై కీలక సమాచారం..
ధ్రువపత్రాల పరిశీలన పూర్తైన తర్వాత రాత పరీక్ష నిర్వహించనున్నట్లు TSLPRB ఛైర్మన్ తెలిపారు. ఈ పరీక్ష ఫిబ్రవరి మూడో లేదా నాలుగో వారంలో జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరీక్ష తేదీలు, హాల్ టికెట్ వివరాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
సహాయం కోసం సంప్రదింపు వివరాలు..
ఇంటిమేషన్ లెటర్ డౌన్‌లోడ్ లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఎదురైతే అభ్యర్థులు [email protected] లేదా 9391005006 నంబర్ ద్వారా బోర్డును సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
అభ్యర్థులకు సూచనలు..
అభ్యర్థులు తరచుగా TSLPRB అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ, తాజా నోటిఫికేషన్లు, పరీక్ష షెడ్యూల్, హాల్ టికెట్లపై అప్‌డేట్‌లు తెలుసుకోవాలని బోర్డు సూచించింది. ఈ నియామక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని TSLPRB మరోసారి స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications