గ్రూప్-2 ‘కీ’ 18న విడుదల
తెలంగాణ గ్రూప్-2 ప్రాథమిక కీ జనవరి 18న విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఓ ప్రకటనలో వెల్లడించింది. జనవరి 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్లో ప్రాథమిక కీ అభ్యంతరాలను స్వీకరిస్తారు.
జనవరి నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్లో ప్రాథమిక కీ అందుబాటులో ఉంటుందని టీజీపీఎస్సీ పేర్కొంది. అభ్యర్థులు ఆన్లైన్లోనే అభ్యంతరాలను తెలపాలని సూచించింది. ప్రాథమిక కీ శనివారం నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.

ఇక అభ్యంతరాలను కేవలం ఇంగ్లీష్ భాషలోనే తెలపాలని టీజీపీఎస్సీ అధికారులు సూచించారు. అభ్యర్థులు చెప్పదలచుకున్న అభ్యంతరాలకు తప్పనిసరిగా.. ఆ అంశం ఏ పుస్తకంలోనిది? ఆథర్ ఎవరు? ఎడిషన్, పేజీ నంబర్, పబ్లిషర్స్ పేరు లేదా వెబ్సైట్ యూఆర్ఎల్ను మెన్షన్ చేయాలని చెప్పారు. ఇక అభ్యంతరాలను ఈ మెయిల్ ద్వారానే పంపాలన్నారు.
గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications