ఏపీలో ఓటర్ ముసాయిదా, 44 లక్షల ఓట్లు ఔట్- మీ పేరు లేకుంటే ఇలా చేయండి..!!
ఏపీలో ఓటర్ ముసాయిదా పై బిగ్ అప్డేట్. ఈ రోజు ఎన్నికల సంఘం ముసాయిదా విడుదల చేయనుంది. ఇప్పటికే ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. క్షేత్ర స్థాయి పరిశీలనలో సమాచారం లభించకపోవడంతో 44.71 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం 'అన్‌కలెక్టబుల్' (సేకరించలేనివి) వర్గంలో చేర్చింది. దీంతో, ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవటం తో పాటుగా ఓటు లేని వారికి మరోసారి ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించి విధి విధానాలను వెల్లడించింది. ఎలా చేయాలో సూచించింది.
ఏపీలో ఎన్నికల సంఘం ఓటర్ల ముసాయిదా విడుదల కు సిద్దమైంది. ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ సర్వే గడువు ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 44.71 లక్షల ఓట్లకు సంబంధించిన సమగ్ర వివరాలు నమోదు కాలేదని గుర్తించారు. ఈ నెల 30న ఈసీ అధికారికంగా విడుదల చేయనున్న ప్రాథమిక ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితాలో ఈ 44.71 లక్షల ఓట్లు ఉండే అవకాశం లేదు. ఈ జాబితాను ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్వోలకు ఇవ్వనుంది. 3 కోట్ల 71 లక్షల 38 వేల 206 మందితో ముసాయిదా జాబితా ఏపీలో ఖరారు చేసారు. కాగా, జాబితాల్లో అభ్యంతరం ఉంటే వచ్చే నెల 31 వరకు క్లయిమ్ చేసుకునే అవకాశం కల్పించారు.

అభ్యంతరాల స్వీకరణకు గడువు
అదే విధంగా ఓటు లేని వారికి కొత్తగా నమోదు చేసుకునే అవకాశం కొనసాగుతుంది. అడ్రెస్ మార్పు వంటి వాటి కోసం నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వీటిని సెప్టెంబర్ 28 వరకు ఎన్నికల సంఘం పరిశీలన చేయనుంది. 2002 ఓటర్ల లిస్ట్ లో ఉండి మ్యాపింగ్ చేసుకోలేని వారికి నోటీసులు జారీ అవుతున్నాయి. ఆధార్ కాకుండా ఈసీ చెప్పిన 11 రకాల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి ఓట్ నమోదు కు అవకాశం కల్పిస్తున్నారు. తమ ఓటు అనుమానాస్పదంగా తొలగించబడిందని భావించేవారు లేదా మార్పులు చేయాలనుకునేవారు ఈ వ్యవధిలో తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. అందిన దరఖాస్తులపై ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, అన్ని సరిచూసుకున్న తర్వాత అక్టోబర్ 3న ఓటర్ల తుది (ఫైనల్) జాబితాను విడుదల చేయనున్నారు.













Click it and Unblock the Notifications