TS Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!
తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. రాష్ట్ర ఇంటర్ మీడియట్ బోర్డు ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ఇంటర్ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫలితాలను విద్యార్ధులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకునే అవకాశం కల్పించారు. వీటికి సంబంధించిన వివరాలను ఇంటర్ బోర్డు ఇప్పటికే వెల్లడించింది.
ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు తెలుసుకునేేందుకు అధికారిక వెబ్‌సైట్ లు tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.inలోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం వెబ్ సైట్ లోకి వెళ్లి TS Inter Results 2025 లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే స్కోరు కార్డు కనిపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

ఈ ఏడాది తెలంగాణలో మార్చి 5 నుంచి 25వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో దాదాపు 10 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పరీక్ష ప్రశ్నాల మూల్యాంకనంతో పాటు ఫలితాల కంప్యూటరీకరణ కూడా పూర్తి కావడంతో ఇవాళ వాటిని విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాలు విడుదలైన తర్వాత రీకౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత మే-జూన్ 2025లో సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.
వచ్చే విద్యసంవత్సరంలో డిగ్రీ, ఇంజనీరింగ్ సహా ఉన్నత విద్యా సంస్ధల్లో అడ్మిషన్లు, ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఇంటర్ ఫలితాలే కీలకం. దీంతో ఈ ఫలితాల కోసం ఆయా విద్యార్ధులు ఎదురుచూస్తున్నారు. వీటిలో సాధించే స్కోరు పలు ప్రవేశ పరీక్షలకు కీలకం కావడంతో ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేస్తున్నారు.












Click it and Unblock the Notifications