తెలంగాణ సెట్-2023 నోటిఫికేషన్ విడుదల: 5 నుంచి అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(TS SET 2023) నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల లెక్చరర్లు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీనుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పేపర్ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించనున్నారు. పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. సెట్ నోటిఫికేషన్‌తో పాటు మరింత సమాచారం కోసం www.telanganaset.org, www.osmania.ac.in అనే వెబ్‌సైట్లను సందర్శించొచ్చు.

గురుకులాల్లో టీజీటీ సహా పలు పోస్టులకు పరీక్ష హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలకు హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్టు 1 నుంచి 23 మధ్య పలు తేదీల్లో జరిగే టీజీటీ, లైబ్రేరియన్, పీడీ ఇన్ స్కూల్స్ తోపాటు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి.
అభ్యర్థులు తమ వివరాలతో బోర్డ్ వెబ్ సైట్ https://treirb.aptonline.in/UI/LoginPages/Login.aspx లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా లాగిన్ అయి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మిగితా పోస్టులకు సంబందించిన హాల్ టికెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
కాగా, ఈ పరీక్షల షెడ్యూల్‌లో గురుకుల నియామక బోర్డ్ స్వల్ప మార్పులు చేసింది. కొన్ని విడతల్లోని సబ్జెక్టులను ఇతర విడతలకు బదిలీ చేసింది.
మొదట ఆగస్టు 1 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, ఆగస్టు 23 వరకు పరీక్షలు జరుగుతాయని బోర్డ్ తెలిపింది. కాగా, గురుకులాల్లో మొత్తం 9210 పోస్టులకు గురుకుల నియామక బోర్డ్ 9 నోటిఫికేషన్లు విడివిడిగా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.63 లక్షల మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. అంటే, ఒక్కో పోస్టుకు సగటున 29 మంది చొప్పున పోటీ పడుతున్నారు.
పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. మొదటి షిప్టులో ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు, మూడో షిప్టు పరీక్ష సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే, విడుదలైన హాల్ టికెట్లలో మూడు పేపర్ల సెంటర్లు వేర్వేరు జిల్లాల్లో కేటాయించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications