అలర్ట్.. తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల రాత పరీక్ష తేదీ మార్పు...
తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్... స్టాఫ్ నర్స్ ఉద్యోగాల రాత పరీక్ష తేదీలో మార్పులు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ పరీక్ష తేదీకి సంబంధించి అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 17వ తేదీన పరీక్షా జరగాల్సి ఉండగా, ఆ పరీక్షా తేదీనీ మార్చారు. నవంబర్ 23వ తేదీన పరీక్ష ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మరో కీలక ప్రకటన ఇచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటలతో అప్లికేషన్ గడువు కూడా ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే అప్లికేషన్లు ఎడిట్ చేసుకునేందుకు అక్టోబర్ 16, 17 తేదీల్లో వీలు కల్పిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

నవంబర్ 23న పరీక్ష..
అయితే, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. నవంబర్ 17వ తేదీన రాత పరీక్ష జరగాల్సి ఉంది. కానీ, ఈ తేదీని మార్పు చేస్తున్నట్లు అధికారులు తాజాగా మరో ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 17న కాకుండా నవంబర్ 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని కోరారు. ఈ పరీక్ష సీబీటీ విధానంలో జరగనుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2050 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో 1576 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు వైద్య విధాన పరిషత్ లో 332 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఆయుష్ శాఖలో అయితే 61 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండగా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో 1 పోస్టును భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఎంఎన్జీ క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.












Click it and Unblock the Notifications