Telangana: టీజీ ఈసెట్, టీజీ లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదల
Telangana: టీజీ ఈసెట్, టీజీ లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ మొలుగారంతో శనివారం సమావేశమైన ఈ షెడ్యూల్ ప్రకటించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఇ.పురుషోత్తంతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
లా కోర్సుల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్ షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్, మార్చి 1 నుంచి మే 25వ తేదీ వరకు లేట్ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. అలాగే.. జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు.మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సులు, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులకు ఈ పరీక్షల ద్వారా అర్హత సాధించాలి. మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్ఎల్ఎం చేయాలనుకువారు డిగ్రీతో పాటు ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

టీజీ ఈసెట్ షెడ్యూల్..
టీజీ ఈసెట్ షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ పరీక్ష తెలంగాణలో డిప్లొమా హోల్డర్లు, బీఎస్సీ(గణితం) డిగ్రీ హోల్డర్లకు బీ.టెక్/బీఈ, బీ-ఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలను కల్పిస్తుంది. ఈ పరీక్ష నోటిఫికేషన్ ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఆన్ లైన్ లో దరఖాస్తులు మార్చి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు ఏప్రిల్ 19ని చివరి తేదీగా ప్రకటించారు. మే 12న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications