శని శుక్రుల పరస్పర దృష్టితో సంసప్తక యోగం.. ఈ రాశులవారికి ఆగస్ట్ లో తిరుగేలేదు!
ఆగస్ట్ 2 నుండి సెప్టెంబర్ 2 వరకు శని శుక్ర గ్రహాల మధ్య పరస్పర దృష్టి ఏర్పడనుంది. సంపదలకు, విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు, క్రమశిక్షణకు, కర్మలకు అధిపతి అయిన శనిదేవుడు ఇద్దరి మధ్య ఏర్పడే సంసప్తక దృష్టి కారణంగా జ్యోతిష్య పరంగా శుభప్రదమైన యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు వస్తాయి. సంసప్తక యోగం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులను గురించి తెలుసుకుందాం.
వృషభరాశి
వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లు , ఇంక్రిమెంట్ లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి, విదేశాలకు వెళ్లేవారికి శుభం కలుగుతుంది. ఇది వృషభ రాశి జాతకులకు అదృష్ట కాలం.

మిథునరాశి
మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారం పెరగవచ్చు. ఆకస్మిక ధనలాభం, విదేశీ అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఏ పని చేసినా ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఇది మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఇచ్చే కాలం.
కన్యారాశి
సంసప్తక యోగం కారణంగా కన్య రాశి వారికి మనసులోని కోరికలు నెరవేరతాయి. ఉద్యోగంలో పురోగతి వస్తుంది. వ్యాపార విస్తరణ అవకాశాలు ఉన్నాయి. పెళ్లి అవకాశాలు ఉంటాయి. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారికి నేడు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి విజయాలు, గుర్తింపు లభిస్తాయి. విదేశీ ఆఫర్లు, ఆస్తి లాభం, వ్యాపార లాభాలు పెరుగుతాయి. ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుంది.
మకరరాశి
మకర రాశి వారికి సంసప్తక యోగంతో ఆదాయం పెరుగుతుంది. కోరికలు నెరవేరతాయి. ఉద్యోగం, పెళ్లి, ఇల్లు-వాహనాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
కుంభరాశి
కుంభరాశి వారికి ఊహించని ఆదాయం, రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. పెళ్లి, సొంత ఇల్లు కల నెరవేరవచ్చు. కుంభరాశి వారికి అన్ని విధాలా శుభ ఫలితాలు వస్తాయి.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications