Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2026లో టాప్ ఉద్యోగాలు, కెరీర్ ఆప్షన్స్ అంచనాలివే..! ఏఐని మించిపోయి..!

2025 దాదాపు పూర్తి కావస్తోంది. కొత్త సంవత్సరం 2026లోకి కోటి ఆశలతో అడుగుపెట్టేందుకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మారుతున్న పరిస్ధితుల ఆధారంగా వచ్చే ఏడాదిలో టాప్ లో ఉండబోతున్న ఉద్యోగాలు, జీతాలు, కెరీర్ ఆప్షన్స్ పై యువతలో భారీ అంచనాలే ఉన్నాయి. ఓవైపు ఏఐ దూకుడు, మరోవైపు లేఆఫ్స్ తో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ టాప్ కెరీర్ ఆప్షన్స్ పై దేశంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిపై అంచనాలు ఓసారి చూద్దాం..

2026లో మన దేశంలో టాప్ లో ఉండబోయే 10 ఉద్యోగాలు లేదా కెరీర్స్ ను ఓసారి పరిశీలిస్తే.. ఇందులో UX డిజైన్ భారతదేశంలో అత్యధిక వృద్ధి చెందుతున్న, అత్యధిక డిమాండ్ ఉన్న మరియు అత్యధిక జీతం పొందుతున్న కెరీర్‌లలో ఒకటిగా మారింది. స్టార్టప్‌ల నుండి ప్రపంచ టెక్ దిగ్గజాల వరకు ప్రతి కంపెనీకి నైపుణ్యం కలిగిన UX డిజైనర్లు అవసరం. మొబైల్ యాప్‌లు, ఏఐ ఇంటర్‌ఫేస్‌లు, స్మార్ట్ పరికరాలు మరియు డిజిటల్ చెల్లింపు వ్యవస్థల పెరుగుదల నేపథ్యంలో మానవ-కేంద్రీకృత డిజైన్ తప్పనిసరి అవుతోంది. ఇందులో ప్రారంభ జీతాలు ఏడాదికి 6 నుంచి 12 లక్షల వరకూ ఉన్నాయి.

The 2026 Job Blueprint Top Careers in India and the Skills You Need to Master AI and Cybersecurity

రెండో స్దానంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఉన్నాయి. ఆర్ధిక, ఆరోగ్య రంగాలతో పాటు డిజైనింగ్, గేమింగ్, ఆటోమేషన్ కు ఇవి కీలకంగా ఉన్నాయి. ప్రతీ కంపెనీ ఇప్పుడు వీటి కోసమే ఎదురుచూస్తోంది. అందుకే వీటికి చాలా డిమాండ్ ఉంది. ఈ రంగంలో ప్రారంభ జీతాలు ఏడాదికి 8 లక్షల నుంచి 20 లక్షలు ఉన్నాయి. ఆ తర్వాత స్ధానంలో డేటా సైన్స్, డేటా అనలిస్టులు ఉన్నారు. ఆధునిక బిజినెస్ లకు ఇవి అత్యవసరం. వీటికి కూడా ప్రారంభ సగటు జీతాలు ఏడాదికి 6 లక్షల నుంచి 15 లక్షలు ఉన్నాయి.

ఇక వీటి తర్వాత స్ధానంలో డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ స్ట్రాటజీ ఉంది. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారుతున్నందున డిజిటల్ మార్కెటింగ్ అత్యంత విశ్వసనీయమైన, అధిక-వృద్ధి చెందుతున్న కెరీర్‌లలో ఒకటిగా ఉంది. ఇందులో సగటు ప్రారంభ జీతాలు 4 నుంచి 12 లక్షల వరకూ ఉన్నాయి. ఆ తర్వాత స్దానంలో ప్రొడక్ట్ డిజైన్ ఉంది. క్లాసికల్ డిజైన్ యొక్క పరిణామం, సృజనాత్మకతను సాంకేతికత, వినియోగదారు ప్రవర్తన, డిజిటల్ అనుభవం కలిపి ప్రొడక్ట్ డిజైన్ గా చెప్తున్నారు. ఇందులోనూ సగటు ప్రారంభ వేతనాలు 7 లక్షల నుంచి 18 లక్షల వరకూ ఉన్నాయి.

వీటి తర్వాత మోషన్ గ్రాఫిక్స్, యానిమేషన్, గేమింగ్ మంచి ఉద్యోగాలు కల్పిస్తోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్, సోషల్ కంటెంట్, గ్లోబల్ ఔట్ సోర్సింగ్ కు ఇది కీలకం. ఏటా గేమింగ్ మార్కెట్ 30 శాతం వృద్ధి చెందుతోంది. ఇందులోనూ సగటు జీతాలు ఏడాదికి 5 నుంచి 15 లక్షల వరకూ ఉన్నాయి. ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ ఉంది. ఆసియా ఖండంలో సైబర్ దాడులు పెరిగిపోతున్న వేళ ఈ రంగానికి డిమాండ్ పెరుగుతోంది. ఇందులోనూ 7 లక్షల నుంచి 20 లక్షల వరకూ ప్రారంభ ప్యాకేజీలు ఉన్నాయి.

The 2026 Job Blueprint Top Careers in India and the Skills You Need to Master AI and Cybersecurity

ఆ తర్వాత మేనేజ్ మెంట్ కెరీర్స్ (మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్, బిజినెస్ అనలిటిక్స్) ఉన్నాయి. వీటిలోనూ మంచి వేతాలు లభిస్తున్నాయి. అలాగే రోబోటిక్స్, ఆటోమేషన్ ఇంజనీరింగ్ లోనూ కెరీర్ బాగుంది. ఇందులో ఏడాదికి 6 నుంచి 15 లక్షల ప్రారంభ వేతనాలున్నాయి. చివరిగా ఎంటర్ ప్రెన్యూర్ షిప్, స్టార్టప్ కెరీర్స్. ఇందులో మీ ఆసక్తి, క్రియేటివిటీ, ఉద్యోగ స్దిరత్వం, నైపుణ్యాలు, భవిష్యత్ డిమాండ్ ఇలాంటి అంశాల ఆధారంగా వీటిని ఎంచుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+