TS Gurukulam : టీఎస్‌ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు ప్రారంభం...

తెలంగాణ గురుకుల పాఠ‌శాల్ల‌లో ఐదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు గాను ప్ర‌క‌టన విడుద‌లైంది. ఈ నెల 18 నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మైంది. అప్ల‌య్ చేసుకునేందుకు జ‌న‌వ‌రి 6 చివ‌రి తేది. పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

టిఎస్ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిసెంబర్‌ 18 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఆన్‌లైన్ విధానంలోనే అప్ల‌య్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్ల‌య్ చేసుకునేందుకు గ‌డువు జ‌న‌వ‌రి 6, 2024 చివ‌రి తేది. కావున్న అర్హులైన అభ్యర్థులు త్వ‌ర‌గా అప్ల‌య్ చేసుకోగ‌ల‌రు.

 TS Gurukulam: Class 5 admissions have started in TS Gurukulam...

ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష-2024

అప్ల‌య్ చేసుకునేందుకు వయస్సు: ఓసీ, బీసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య.. ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి.త‌ల్లిదండ్రుల \ గార్డెన్ ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం ప్ర‌కారం అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది. గ్రామీణ ప్రాంతం వారైతే, రూ.1.50,000.. పట్టణ ప్రాంతం వారైతే రూ.2,00,000లకు మించ‌కుండా ఉండాలి.
ప్రవేశ పరీక్ష విధానం : ఈ ప్రవేశ పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఈ ప‌రీక్ష‌ను ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లిష్ మాధ్య‌మాల్లో ఉంటుంది. తెలుగు (20 మార్కులు), ఇంగ్లిష్(25 మార్కులు), గణితం(25 మార్కులు), మెంటల్‌ ఎబిలిటీ(10 మార్కులు), పరిసరాల విజ్ఞానం(20 మార్కులు) ప్ర‌శ్న‌లు నాలుగో తరగతి స్థాయివి ఇస్తారు.
అడ్మిష‌న్‌ ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు ఫీజు: వ‌ంద రూపాయ‌లు మాత్ర‌మే చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో మాత్ర‌మే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత : విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 2023-24 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చ‌దువుతూ ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న వారైనా అర్హులే.

ప‌రీక్ష తేదీల వివ‌రాలు :

దరఖాస్తులు ప్రారంభ తేదీ: డిసెంబర్‌ 18, 2023.
చివరి తేదీ: జనవరి 6, 2024.
ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 11, 2024.
పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌: https://tgcet.cgg.gov.in/ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+