Cyclone Murasu:బంగాళాఖాతంలో ‘మురాసు’ విలయం. అత్యంత భారీ వర్షాలు

బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ అల్లకల్లోలం అనుకున్నట్లే ఉగ్రరూపం దాల్చింది. నైరుతి బంగాళాఖాతం , దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం, ఇవాళ ఉదయం 11:30 గంటల సమయానికి మరింత బలపడి 'మురాసు' (Murasu) తుఫానుగా రూపాంతరం చెందింది. భారత దేశం సూచించిన ఈ పేరుకు 'యుద్ధ భేరి' (War Drum) అని అర్థం. వాయుగుండం నుంచి తుఫానుగా మారిన ఈ వ్యవస్థ తీవ్రమైన వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనిస్తోంది.

తీరం వైపు వేగంగా అడుగులు.. చెన్నై, విశాఖ వైపు

ఉదయం కేంద్రీకృతమైన నివేదికల ప్రకారం, ఈ తుఫాను తమిళనాడులోని చెన్నైకి ఆగ్నేయంగా సుమారు 700 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి 770 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 770 కిలోమీటర్లు , ఒంగోలుకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత కొన్ని గంటలుగా గంటకు 23 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుఫాను నిమిషనిమిషానికీ మరింత శక్తినార్జించుకుంటోందని వాతావరణ శాఖ తెలిపింది.

Cyclone Murasu Forms in Bay of Bengal Threatens to Cross Andhra Coast Between Nellore and Narsapuram
మళ్లీ తుఫాను.. ప్రచండ వేగంతో నేడు తీవ్ర వాయుగుండంగా మారి కుంభవృష్ఠి
మళ్లీ తుఫాను.. ప్రచండ వేగంతో నేడు తీవ్ర వాయుగుండంగా మారి కుంభవృష్ఠి

రేపటికి తీవ్ర తుఫానుగా మారే ప్రమాదం!

ఈ 'మురాసు' తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. నవంబర్ 2వ తేదీ నాటికి ఇది 'తీవ్ర తుఫాను'గా (Severe Cyclonic Storm) బలపడి అత్యంత ప్రమాదకరంగా మారనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ధ్రువీకరించింది.

Cyclone Murasu: పలచబడిన 'అర్నబ్'.. మొదలైన మురసు ప్రతాపం
Cyclone Murasu: పలచబడిన 'అర్నబ్'.. మొదలైన మురసు ప్రతాపం

నెల్లూరు-నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం!

ఈ తీవ్ర తుఫాను పశ్చిమ-వాయువ్య దిశలోనే పయనిస్తూ, నవంబర్ 3వ తేదీ ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిధిలోని నెల్లూరు , నర్సాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో సముద్రం తీవ్రంగా ఉప్పొంగడంతో పాటు గరిష్ఠంగా గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో రాకాసి గాలులు వీస్తాయని, అప్పుడప్పుడు ఇవి 120 కిలోమీటర్ల వేగాన్ని కూడా పుంజుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరప్రాంత జిల్లాల యంత్రాంగాన్ని హైఅలర్ట్‌పై ఉంచడమే కాకుండా, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+