UGC-NET 2024: రేపటి యూజీసీ నెట్ పరీక్ష వాయిదా-కారణమిదే..!
యూజీసీ నెట్ డిసెంబర్ 2024 సెషన్ పరీక్షలపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ కీలక అప్ డేట్ ఇచ్చింది. రేపు జరగాల్సిన యూజీసీ సెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఈ పరీక్ష వాయిదా వేయాలని ఎంకే స్టాలిన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు లేఖ రాశారు.
దేశవ్యాప్తంగా యూజీసీ నెట్ పరీక్ష కోసం అభ్యర్ధులు సిద్ధమవుతున్నారు. అయితే సంక్రాంతి పండుగను పట్టించుకోకుండా జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ రేపు (జనవరి 15)న కూడా పరీక్ష తేదీగా డిక్లేర్ చేసింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ స్దాయి వ్యక్తి దీనిపై నేరుగా కేంద్రమంత్రికి లేఖ రాశారు. దీంతో ఎన్టీఏ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన చేసింది. అయితే దీన్ని ఎప్పుడు నిర్వహిస్తారో మాత్రం చెప్పలేదు.

రేపటి పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామో త్వరలో ప్రకటిస్తామని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అయితే జనవరి 16న జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిథిగా ఉంటుందని తెలిపింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో షిప్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ లో అడ్మిషన్ల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ తరఫున నెట్ పరీక్షను నిర్వహిస్తోంది.
దీనికి వివిధ రాష్ట్రాల నుంచి అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు చివరి నిమిషంలో ఎన్టీఏ పరీక్ష వాయిదా నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications