UGC NET 2024: రేపటి నుంచి యూజీసీ నెట్ పరీక్షలు-అభ్యర్ధులూ ఇవి మర్చిపోకండి..!
యూనివర్శిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం నిర్వహించే యూజీసీ నెట్ పరీక్షలు రేపు (జనవరి 3 ) ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 16 వరకూ ఈ పరీక్షలను నిర్వహిస్తారు. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు రాసే అభ్యర్ధులకు ఇప్పటికే అడ్మిట్ కార్డుల్ని విడుదల చేశారు. వీటితో పాటు పరీక్షలు రాసే అభ్యర్ధులు ఏమేం తీసుకెళ్లాల్సి ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
85 వేర్వేరు సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షను అభ్యర్ధులు ఓఎంఆర్ షీట్లపైనే రాయాల్సి ఉంటుంది. రెండు షిఫ్టులలో పరీక్షలు ఉంటాయి. తొలి సెషన్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. అలాగే రెండవ సెషన్ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.

యూజీసీ నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్‌లో 100 మార్కులకు 50 ప్రశ్నలు అవగాహన, రీడింగ్ కాంప్రహెన్షన్, రీజనింగ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, టీచింగ్ ఎబిలిటీ వంటి సాధారణ నైపుణ్యాలపై ఉంటుంది. పేపర్ 2 అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌పై 200 మార్కుల విలువైన 100 ప్రశ్నలకు నిర్వహిస్తారు. అభ్యర్థులు గతంలో విడుదల చేసిన అడ్మిట్ కార్డు హార్డ్ కాపీని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఓ పాస్‌పోర్ట్-సైజ్ ఫొటో, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడీ కార్డు, ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
యూజీసీ నెట్ రాసే పరీక్షా కేంద్రంలోకి వెళ్లాక ఎలక్ట్రానిక్ పరికరాల్ని వాడటం నిషేధం. అభ్యర్థి పరీక్ష సమయంలో ముందు లేదా తర్వాత ఏదైనా దుష్ప్రవర్తనకు పాల్పడితే కేసులు బుక్ చేస్తామని ఎన్టీఏ హెచ్చరిస్తోంది. ఇందుకు గాను భవిష్యత్తులో మూడు సంవత్సరాలు డిబార్ చేస్తారు. క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు.












Click it and Unblock the Notifications