UPSC CSE Results 2023: యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల విడుదల...!
అఖిల భారత సర్వీసు అధికారుల ఎంపిక కోసం కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గతేడాది నిర్వహించిన యూపీఎస్సీ సీఎస్ఈ (UPSC CSE Result 2023) పరీక్షా ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. గతేడాది మే 28న యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. వీటిలో ఎంపికైన అభ్యర్ధులకు సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం డిసెంబర్ 8న మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జనవరి 2 నుంచి 9 వరకూ ఇంటర్వ్యూలు జరిగాయి. వీటి తర్వాత ఫైనల్ గా ఎంపికైన వారి జాబితా ఇవాళ ప్రకటించారు.
గతేడాది విడుదల చేసిన యూపీఎస్సీ సీఎస్ఈ నోటిఫికేషన్ ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో మొత్తం 1105 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇవాళ విడుదల చేసిన తుది ఫలితాలను యూపీఎస్సీ వెబ్ సైట్ లో తెలుసుకునే అవకాశం కల్పించారు. కమిషన్ రెండు వెబ్ సైట్లు upsc.gov.in, upsconline.nic.inలో ఫలితాలను తెలుసుకోవచ్చు. స్కోరు కార్డుల్ని 15 రోజుల్లో విడుదల చేయనున్నారు.

యూపీఎస్సీ ఇవాళ ప్రకటించిన సివిల్ సర్వీస్ తుది ఫలితాల్లో ఎంపికైన వారిలో టాపర్ల జాబితాన కూడా విడుదల చేశారు. ఇందులో వరుసగా ఆదిత్య శ్రీవాస్తవ, అనిమేష్ ప్రధాన్, డోనూరు అనన్య రెడ్డి, పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్, రుహానీ, సృష్టి దాబాస్ అన్మోల్ రాథోడ్, ఆశిష్ కుమార్, నౌషీన్, ఐశ్వర్యం ప్రజాపతి టాప్ 10 జాబితాలో ఉన్నారు. అలాగే టాప్ 20 వరకూ జాబితాలో పేర్లు కూడా ఇచ్చారు.












Click it and Unblock the Notifications