యూపీఎస్సీ ఈఎస్‌ఈ, సీఎంఎస్‌ఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేసాయ్...
యూపీఎస్సీ అభ్యర్థులకు గమనిక.. యూపీఎస్సీ ఈఎస్‌ఈ, సీఎంఎస్‌ఈ ఫైనల్ ఫలితాలు 2024 విడుదలయ్యాయి. ఈ ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా జూన్ 23న నిర్వహించిన 'ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2024' మెయిన్స్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఇక, ఈ పరీక్ష ద్వారా యూపీఎస్సీ దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 167 పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లో చెక్‌చేసుకోగలరు.
మొత్తం 167 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 6. 2023 నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్ 26.2023 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వీటికి సంబంధించిన పరీక్ష జూన్ 23న జరిగిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా వీటి ఫలితాలు విడుదలయ్యాయి.

వీటితో పాటు వివిధ విభాగాల్లో 827 మెడికల్ ఆఫీసర్/ జీడీఎంవో ఉద్యోగాల భర్తీకి సంబంధించి 'కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ విభాగాలకు సంబంధించిన పరీక్ష జులై 14వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.












Click it and Unblock the Notifications