UPSC : పరీక్షల నిర్వహణపై యూపీఎస్‌సి కీలక నిర్ణయం.. అభ్యర్థులకు ఇవి తప్పనిసరి..
నీట్ యూజీ పేపర్ లీక్ అంశం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణలో యూపీఎస్‌సి కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష నిర్వహణలో కీలక మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పరీక్షల నిర్వహణలో న్యూ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయం తీసుకుంది.
నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అవకతవకలు దేశవ్యాప్తంగా ఎన్నో నిరసనలు ఆందోళనలకు తెరలేపాయి. ఈ పరీక్షల నిర్వహణలోనే ఎన్నో లోపాలున్నాయని తాజాగా ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసింది. దీంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సి) కొత్త టెక్నాలజీని విధానాలను అమల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల కోసం ఇకనుంచి కొన్నింటిని తప్పనిసరి చేసింది. అందులో అత్యాధునిక ఆధార్ అథెంటికేషన్, ఫింగర్‌ప్రింట్ తీసుకోవడం, ఫేషియల్ రికగ్నిషన్ వంటి చర్యలను తప్పనిసరి చేసింది. వీటివల్ల పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని యూపీఎస్‌సి భావిస్తోంది. ఇవే కాదు, ఇంకా పరీక్షల నిర్వహణలో భాగంగా సీసీ కెమెరాలతో నిఘా పెంచడం, ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ)ని ఉపయోగించడం వంటివన్నీ చేయనున్నారు. ఈ-అడ్మిట్ కార్డ్‌లపై QR కోడ్ స్కానింగ్ వంటి చర్యలు కూడా చేపట్టాలని యూపీఎస్‌సి నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ మయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు యూపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.

14 పరీక్షల నిర్వహణ..
ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) మొత్తం 14 పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో సివిల్ సర్వీసెస్ పరీక్షలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు, ముఖాముఖీ పరీక్షలను కూడా యూపీఎస్‌సి నిర్వహిస్తోంది. ఇక, ఈ పరీక్షల నిర్వహణ సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకే యూపీఎస్సీ ఈ కొత్త ఆధునిక విధానాలను అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్, పరీక్ష కేంద్రాల జాబితా, అభ్యర్థుల హాజరుశాతం వంటి వివరాలన్నింటిని పరీక్షకు రెండు లేదా మూడు వారాల ముందు సర్వీస్ ప్రొవైడర్లకు అందజేస్తారు.












Click it and Unblock the Notifications