World Students Day:ప్రపంచ విద్యార్థుల దినోత్సవం-ఆ మహనీయుడికి వందనం..!!

APJ Abdul Kalam Birth Anniversary:జీవితంలో విజయం సాధించాలంటే మూడు ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించారు. ఈ మూడు అంశాలను అర్థం చేసుకుని వాటిపై పట్టు సాధించగలిగితే విజయం తప్పక వరిస్తుందని చెప్పేవారు. ఆ మూడు అంశాలు:తపన,విశ్వాసం,ఆశ. ఈ రోజు ప్రపంచ విద్యార్థుల దినోత్సవం. అసలు ఈ రోజు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం.

అక్టోబర్ 15వ తేదీ ప్రపంచ విద్యార్థుల దినోత్సవం జరుపుకుంటాం. భారతదేశ 11వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టిన రోజు అక్టోబర్ 15. ఆయన ఓ గొప్ప ఉపాధ్యాయుడు, ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్త కూడా. విద్యార్థుల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, ఎప్పుడూ విద్యార్థులను ఆయన ప్రోత్సహించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కూడా అబ్దుల్ కలాం విద్యార్థులతో ముచ్చటించడం మర్చిపోయేవారు కాదు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ పలు స్కూళ్లను స్వయంగా సందర్శించి అక్కడి విద్యార్థులు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పేవారు.

Why World Students Day Falls on October 15 A Tribute to APJ Abdul Kalam

అక్టోబర్ 15వ తేదీ డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఆరోజున ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. ఆయన నేర్పని విలువలు, విద్యార్థులు జీవితంలో స్థిరపడేందుకు పాటించాల్సిన మెలుకువలు, శాస్త్రవేత్తగా టెక్నాలజీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 15వ తేదీనిప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా డిక్లేర్ చేసింది.

ప్రజల రాష్ట్రపతిగా గుర్తింపు పొందిన అబ్దుల్ కలాం, తన జీవితంలో ఎక్కువ సమయం విద్యార్థులను సరైన మార్గంలో నడిపించేందుకు అంకితం చేశారు. ఎంతో మంది విద్యార్థులకు ఒక గైడ్‌గా ఉన్నారు స్ఫూర్తిని నింపారు.ఆయన నేర్పని పాఠాలు, చేసిన బోధ భారత్‌తో పాటు ఇతర దేశాలపై కూడా చెరగిన ముద్ర వేసింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అబ్దుల్ కలాంది. యువత ఎన్నో అద్భుతాలు సాధిస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన. టెక్నాలజీతో కూడిన విద్య దేశాభివృద్ధికి బాట వేస్తుందని విశ్వసించేవారు.

తమిళనాడులోని రామేశ్వరంలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం పాఠశాలలో చదివేటప్పుడు యావరేజ్ స్టూడెంట్‌గా ఉండేవారు. అయితే బాగా చదివి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉండేది. దీంతో ఆయన గంటల కొద్దీ పుస్తకాలు చదివేవారు. ముఖ్యంగా గణిత శాస్త్రంపై ఎక్కువగా ఫోకస్ చేసేవారు. అబ్దుల్ కలాం తాను సాధించిన విజయాలను దేశానికి శాస్త్ర సాంకేతిక రంగంలో చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయన్ను 1981లో పద్మభూషణ్‌తో,1990లో పద్మ విభూషణ్‌తో,దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో గౌరవించింది. రక్షణ రంగంలో, అంతరిక్ష రంగంలో ఆయన చేసిన కృషి వర్ణించలేనిది.

ఇక 2015లో షిల్లాంగ్‌లో ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో లెక్చర్ ఇస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో మృతి చెందారు. తన చివరి శ్వాస వరకు విద్యార్థులతోనే గడిపిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం దేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. విద్యార్థులు, యువత అంటే ఎంతో ఇష్టమైన అబ్దుల్ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+