మోదీపై ప్రకాష్ రాజ్ వేసిన ఒకే ఒక్క ట్వీట్.. కొట్టుకుంటున్న నెటిజన్లు!

కేంద్ర ప్రభుత్వ విధానాలను, ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించే వారిలో దక్షిణాది ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 3 రూపాయల వరకు పెరగడంతో ప్రకాష్ రాజ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ 14 ఏళ్ల క్రితం(2012లో) ఇంధన ధరల పెరుగుదలపై చేసిన ఓ పాత ట్వీట్‌ను ప్రకాష్ రాజ్ వెలికితీసి దానికి వ్యంగ్యంగా క్యాప్షన్ జత చేస్తూ రీ-ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోదీ.. "పెట్రోల్ ధరలు భారీగా పెరగడం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. దీనివల్ల గుజరాత్ ప్రభుత్వంపై వందల కోట్ల అదనపు భారం పడుతుంది" అని ట్వీట్ చేశారు. ప్రస్తుత ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పాత ట్వీట్‌ను షేర్ చేసిన ప్రకాష్ రాజ్.. "అంటే ఇప్పుడు మీ ఉద్దేశం నెహ్రూ గారు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనా? #justasking" అంటూ గతాన్ని గుర్తు చేస్తూ చమత్కరించారు. అలాగే మోదీ గతంలో ద్రవ్యోల్బణం, ధరల నియంత్రణపై మాట్లాడిన ఓ పాత వీడియోను కూడా షేర్ చేస్తూ.. "ఈ దేశం ఈ అలవాటుగా మారిన అబద్ధాలను ఇంకెంత కాలం భరిస్తుంది?" అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.

Actor Prakash Raj Viral Tweet on PM Modi Over Fuel Price Hike Sparks Massive Online Debate

అయితే ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ చేసిన ఈ విమర్శలపై సోషల్ మీడియాలో నెటిజన్లు, మోదీ అభిమానులు భగ్గుమంటున్నారు. ఆయనను టార్గెట్ చేస్తూ నెట్టింట కౌంటర్లు ఇస్తున్నారు. "గతంలో హర్యానా ప్రభుత్వం ఇంధన ధరలను 5 రూపాయలు పెంచినప్పుడు మీ నోరు ఎందుకు మూతపడింది? కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పుడు ఎందుకు ప్రశంసించలేదు? గత యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్ బాండ్ల భారం వల్లే ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయనే నిజం మీకు తెలియదా?" అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా యూఏఈ లాంటి దేశాల్లోనే ఇంధన ధరలు 8 నుంచి 10 శాతం పెరిగాయని.. కనీస గణాంకాలు చూసుకోకుండా ప్రకాష్ రాజ్ కేవలం రాజకీయ విమర్శలు చేస్తున్నారంటూ నెటిజన్లు ఆయనపై ట్రోలింగ్‌కు దిగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+