పవన్ కల్యాణ్‌కు గిఫ్ట్‌గా ఆడుకునే బొమ్మలు
Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్‌కు బహుమతుల వరద అందుతున్న బహుమతుల పరంపర ఇంకా కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి వంటి ప్రతిష్ఠాత్మక పదవిని అధిరోహించిన నేపథ్యంలో- ఆయన కుటుంబ సభ్యులు పవన్‌కు ఖరీదైన కానుకలను అందజేస్తోన్నారు.
మెగాస్టార్ చిరంజీవి భార్య, పవన్ కల్యాణ్ వదిన సురేఖ.. ఆయనకు ఖరీదైన మోంట్ బ్లాంక్ పెన్‌ను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. మోంట్ బ్లాంక్ గ్రేట్ క్యారెక్టర్స్ ఫౌంటెన్ మోడల్‌కు చెందిన పెన్ అది. దీని ధర అక్షరాలా 3,56,200 రూపాయలు. 1901 లిమిటెడ్ ఎడిషన్‌గా దీన్ని వాల్ట్ డిస్నీ తయారు చేసింది.

తాజాగా పవన్ కల్యాణ్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు ప్రముఖ నటుడు, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ. స్టార్ వార్స్ లెగో సెట్‌ను కానుకగా అందజేశారు. దీని ధర 70,000 రూపాయల పైమాటే. స్టార్ వార్స్ యూనివర్స్ సిరీస్ మూవీల్లో నటించిన క్యారెక్టర్లతో కూడిన బొమ్మలు, ఐకనిక్ స్పేస్‌షిప్స్.. వంటివి ఇందులో ఉంటాయి.
ఈ సెట్‌ను పవన్ కల్యాణ్‌కు అందజేశారు సాయి ధరమ్ తేజ్. ఈ సందర్భంగా పవన్‌తో కలిసి దిగిన ఫొటోను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. చిన్నప్పుడు తనకు ఇలాంటి సార్ వార్స్ సెట్‌ను ఇచ్చేవాడని, ఇప్పుడు ఆ అవకాశం తనకు లభించిందని సాయి ధరమ్ చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవడం, ఉప ముఖ్యమంత్రి హోదాను పొందడంతో సాయి ధరమ్ తేజ్.. తిరుమలను సందర్శించిన విషయం తెలిసిందే. పవన్ గెలిస్తే కాలినడకన తిరుమలకు వస్తానంటూ మొక్కిన మొక్కులను చెల్లించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.
చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్‌కు కీలక శాఖలు లభించిన విషయం తెలిసిందే. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు దక్కాయి. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ శాఖలను ఆయన ఏరికోరి తీసుకున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications