Anasuya: మగజాతిని అంత మాట అనేసిందేంటి ..ఏం చేస్తారో ఏంటో..?
నటి అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడు తన గ్లామర్‌తో వార్తల్లో ఉండే అనసూయ ఈసారి మాత్రంగా పూర్తి భిన్నంగా ఆలోచించింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ మగాళ్లకు ఓ ఛాలెంజ్ విసరడం జరిగింది. మన దేశంలో ఆడవాళ్లు సాంప్రదాయంగా ఉండాలని చెప్పే వారికి ఆమెకు ఈ సవాల్ విసిరింది.
మహిళలు సాంప్రదాయమైన చీరలు కట్టుకుని మన దేశపు సంసృతిని కాపాడలనే మగవారు...ముందు మీరు పంచెలు, ధోతి వంటి సాంప్రదాయ దుస్తులు ధరించాలంటూ ఓ వ్యక్తి మాట్లాడిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఈ వీడియోను షేర్ చేస్తూ.మహిళల నుంచి సాంప్రదాయమైన కట్టు ఆశించే మగ వారు దీన్ని అనుసరించాలి. సాంప్రదాయం గురించి మాట్లాడేవారు పంచెలు, ధోతి కట్టుకోగలరా ..? అంటూ సవాల్ విసిరింది. అనసూయ మగాళ్ల గురించి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే..ఆమె అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న పుష్ప-2లో విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ దేవరలో కూడా అనసూయ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కిందని సమాచారం.












Click it and Unblock the Notifications