హీరోయిన్లందరూ నా ఫ్రెండ్సే.. భర్త రొమాంటిక్ సీన్లపై నటి షాకింగ్ కామెంట్స్!
పాకిస్థాన్ సినీ ఇండస్ట్రీలో అగ్రనటిగా వెలుగొందుతున్న అయేజా ఖాన్ తన వ్యక్తిగత జీవితం, భర్త డానిష్ తైమూర్ వృత్తిపరమైన నిర్ణయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న అయేజా ఖాన్.. తెరపై తన భర్త ఇతర హీరోయిన్లతో చేసే ఇంటిమేట్ సన్నివేశాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఓ నటిగా తనకు సినిమా రంగంపై పూర్తి అవగాహన ఉందని.. అందుకే తన భర్త విషయంలో తాను ఎప్పుడూ అనుమానపడనని అయేజా ఖాన్ స్పష్టం చేశారు.
సాధారణంగా తమ భర్త ఇతర మహిళలతో రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తే ఏ భార్యకైనా అసూయ కలగడం సహజమని.. అయితే తాను మాత్రం అటువంటి అనుమానపు భార్యను కాదని అయేజ్ ఖాన్ పేర్కొన్నారు. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఉన్న స్వేచ్ఛా వ్యత్యాసాల గురించి మాట్లాడుతూ.. అబ్బాయిలకు దుస్తుల విషయంలో గానీ, తిరిగే విషయంలో గానీ మన సమాజం ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. వృత్తిపరంగా నటీనటుల మధ్య ఉండాల్సిన స్పేస్ ఇవ్వడం వల్ల బంధాలు బలపడతాయని ఆమె నమ్ముతున్నారు.

నటన అనేది ఓ వృత్తి మాత్రమేనని.. తన భర్తతో కలిసి నటించే హీరోయిన్లందరూ తనకు మంచి స్నేహితులని అయేజా ఖాన్ వెల్లడించారు. భర్తపై అనవసరంగా అనుమానం పెంచుకోవడం లేదా గొడవ పడటం వల్ల మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటామని ఆమె హితవు పలికారు. కొన్నిసార్లు ప్రేక్షకులు కొన్ని సన్నివేశాలను ఆదరించనప్పుడు నటులుగా తాము ఆ విషయాన్ని గ్రహించి తదుపరి సినిమాల్లో అటువంటి వాటిని తగ్గించుకుంటామని అయేజా ఖాన్ పేర్కొన్నారు.
అయేజా ఖాన్, డానిష్ తైమూర్ 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన ఇన్నేళ్ల తర్వాత కూడా వీరి బంధం ఎంతో బలంగా ఉండటానికి ఒకరినొకరు గౌరవించుకోవడమే కారణమని అభిమానులు భావిస్తున్నారు. అయితే గతంలో డానిష్ తైమూర్ ఒక షోలో మాట్లాడుతూ.. ఇస్లాం ప్రకారం తనకు నాలుగు పెళ్లిళ్లు చేసుకునే వెసులుబాటు ఉందని, కానీ తాను చేసుకోవడం లేదని చేసిన కామెంట్స్ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. తన భర్త వివాదాల్లో ఉన్నప్పటికీ అయేజా ఖాన్ మాత్రం ఆయనకు పూర్తి మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications