హీరోయిన్స్‌కి ఇష్టం ఉండే వాళ్లతో పక్క ఎక్కుతున్నారు..!!
తెలుగు ప్రేక్షకులకు నటి గాయత్రి గుప్తా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. సినిమాలపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత 'ఫిదా', 'కొబ్బరి మట్ట', 'ఐస్ క్రీం' వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత వివాదాలతో.. బోల్డ్ కామెంట్స్ తోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది.
మీటూ ఉద్యమంతో హల్‌చల్..
గతంలో మీటూ ఉద్యమం సమయంలో గాయత్రి గుప్త చేసిన ఆరోపణలు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలను కుదిపేశాయి. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే విషయాన్ని తాను కూడా అనుభవించానని గాయత్రి అప్పుడు స్పష్టంగా చెప్పింది.

ఇష్టం ఉండే..
ఇటీవల ఆమె పాత ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు మరోసారి వైరల్ అవుతున్నాయి. "సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని ఎవరైనా చెబితే అది అబద్ధం. నేను కూడా ఫేస్ చేశాను. చాలా మంది హీరోయిన్లు ఇష్టం ఉండే దర్శకులు, నిర్మాతలతో శృంగారం చేస్తారని.. అలా ఆఫర్స్ తెచ్చుకుంటారని తెలిపారు. ఇంకొందరు ఇష్టం లేకపోయినా కెరీర్ కోసం ఒప్పుకుంటారని.. ఇదంతా ఇప్పుడు కామన్ అయిపోయిందని గాయత్రి తెలిపింది.
ఇక తన అనుభవాలను పంచుకుంటూ, ఇండస్ట్రీలో అడుగుపెట్టే కొత్త అమ్మాయిలకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దు.. చాలా మంది అమాయకులు కాస్టింగ్ కౌచ్‌కి బలైపోతున్నారు. అలాంటి వారికి దీని గురించి చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా" అని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతే కాకుండా ఆటోఇమ్యూన్ డిసీజ్ బారినపడి, ట్రీట్మెంట్ కోసం తన వద్ద ఉన్న మొత్తాన్ని ఖర్చు చేసానని మరో ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. చివరికి అద్దె కట్టుకునే డబ్బు కూడా లేక ఇబ్బందుల్లో పడ్డానని ఎమోషనల్ అయ్యింది. ఈ సమయంలో గతంలో ఉన్న పరిచయంతో సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ పెట్టి తన పరిస్థితి వివరించానని.. వెంటనే రిపోర్ట్స్ పంపమని అడిగి.. మొత్తం 3 నెలల చికిత్స ఖర్చు ఎంత అవుతుందో అడిగారని చెప్పింది. దాంతో తాను ఇచ్చిన రిపోర్ట్స్ చూసి ఒక వారం లోపే ఆయన రూ.5.5 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశారని గాయత్రి గుప్త వెల్లడించింది.












Click it and Unblock the Notifications