విడాకులపై స్పందించిన యాంకర్... సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

ఒకప్పుడు బుల్లితెర మీద సందడి చేసిన వారిలో హరితేజ కూడా ఒకరు. కొన్ని టెలివిజన్ షోలకు యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుందామె. కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్ మొదలు పెట్టిన హరితేజ తరువాత బుల్లితెరపై హల్ చల్ చేసింది. తొలినాళ్లలో కొన్ని సీరియల్స్‌లో నటించి మెప్పించింది కూడా. 'మనసు మమత' 'ముత్యమంత పసుపు', 'రక్త సంబంధం', 'అభిషేకం', 'తాళి కట్టు శుభవేళ', 'శివ రంజనీ', 'కన్యాదానం' వంటి సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది.

ఈ సమయంలోనే కొన్ని టీవీ షోలకు వ్యాఖ్యతగా కూడా వ్యవహరించింది. ఇక బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో కంటెస్ట్‌గా పాల్గొని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా హరితేజ చెప్పిన జనపద పద్యాలకు అభిమానులు ఫిదా అయ్యారు. మొదటి సీజన్‌లో టాప్ 5 స్థానంలో కూడా సంపాదించిందామె. బిగ్‌బాస్ తరువాత ఆమెకు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కాయి. దమ్ము , అఆ, యూ ట‌ర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే వంటి సినిమాల్లో నటించింది.

Actress Hari Teja reacts on divorce

కెరీర్ బిజీగా ఉన్న సమయంలోనే కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో హరితేజ వివాహం చేసుకుంది. వీరిద్దరికి 2021 భూమి అనే కూతురు కూడా జన్మించింది. ఇక పాప పుట్టిన తరువాత హరితేజ నటనకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇదే సమయంలో హరితేజ కాస్తా లావు కూడా అవడంతో..సినిమాలకు గుడ్ బై చెప్పిందని అనుకున్నారంతా. కాని స్లిమ్‌గా మారి అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా ఈ బ్యూటీ ఆస్ట్రేలియాలో సింగిల్‌గానే వెకేషన్‌‌కు వెళ్లింది. భర్త, కూతురు లేకుండా ఒంటరిగా వెకేషన్‌‌కు వెళ్లడంతో.. హరితేజ విడాకులు తీసుకుంటుందనే వార్తలు తెర మీదకు వచ్చాయి.

దీనికి తోడు హరితేజ తన భర్తతో దిగిన ఫొటోలను ఇటీవల కాలంలో తన సోషల్ మీడియాలో పోస్టు చేయకపోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చినట్టు అయింది. తాజాగా విడాకులు గురించి హరితేజనే నేరుగా ప్రశ్నించాడు ఓ నెటిజన్. మీ భర్త దీపక్‌తో విడాకులు తీసుకున్నారా...? అని ప్రశ్నించాడు. దీనికి హరితేజ సమాధానం ఇస్తూ.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే అంటూ తన భర్త దీపక్‌తో ఉ‍న్న ఫోటోను షేర్‌ చేసి విడాకుల కామెంట్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+