మోహన్ బాబుపై నటి సంచలన కామెంట్స్..షూటింగ్‌లో అలా చేశారంటూ
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆయన పోషించిన పాత్రలు , చేసిన సినిమాలు మరే నటుడు కూడా చేయలేదంటే అతిశేయోక్తి కాదనిపిస్తోంది. అలాగే ఇండస్ట్రీలో మోహన్ బాబుకు అంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. నటుడుగా, హీరోగా, విలన్‌గా, నిర్మాతగా ఆయన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక మోహన్ బాబు క్రమశిక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏదైన టైంకు జరగాలని అనుకుంటారు. తనవల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని భావిస్తుంటారు. ప్రస్తుతం మోహన్ బాబు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే తాజాగా మోహన్ బాబు వ్యక్తిత్వం ఎలా ఉంటుందనే దాని గురించి నటి లిరీష చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.'వకీల్ సాబ్', 'బేబీ' వంటి సినిమాలతో నటి లిరీష బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమాతో లిరీష సూపర్ ఉమెన్‌గా పేరు తెచ్చుకుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ లిరీషను 'సూపర్ ఉమెన్' అంటూ ర్యాగింగ్ చేస్తారు. ఆ ఒక్క సీన్ బాగా వైరల్ అయ్యింది. దీంతో లిరీష ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. తాజాగా లిరీష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మోహన్ బాబు వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చింది.

గతంలో నేను అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అలీ గారి సాయంతో 'పొలిటికల్ రౌడీ' సినిమాలో నటించే అవకాశం లభించింది. అందులో నాది ఛార్మీ ఫ్రెండ్ పాత్ర. సినిమాలో నా లుక్ చూస్తే చాలా కామెడీగా ఉంటుంది. ఇక ఓ సీన్ షూట్లో భాగంగా ప్రకాష్ రాజ్ నన్ను తోస్తే కిందకి పడాలి. సీన్ షూటింగ్ జరుగుతుంది. ప్రకాష్ రాజ్ నన్ను తోసినా నేను కిందకి పడటం లేదు. దీంతో మోహన్ బాబుగారు వెనుక నుండి వచ్చి నన్ను తోసేశారు. నేను కింద పడ్డాను. షాట్ ఓకే అయ్యింది. కానీ నేను కింద పడిపోవడంతో రాళ్ళు తగిలి నా చేతులకు గాయం అయింది.
దీన్ని గమనించిని మోహన్ బాబుగారు వెంటనే ఆయింట్మెంట్ వంటివి తెచ్చి నాకు ఫస్ట్ ఎయిడ్ చేయించారు. అలాగే సీన్ ఎలా చెయ్యాలో వివరించారని లిరీష ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మోహన్ బాబుగారికి షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చేవాళ్ళు అంటే నచ్చరు. పిలిచి మరీ క్లాస్ పీకుతుంటారు. ఆయనకు భయపడి తాను షూటింగ్ సమయానికి కన్నా ముందే అక్కడ ఉండేదాన్ని అని లిరీష తెలిపింది. పైకి కోపంగా కనిపిస్తారు కానీ.. మోహన్ బాబు చాలామంచి వ్యక్తి. ఆయన దగ్గర నుంచి నటన, క్రమశిక్షణ వంటివి బాగా నేర్చుకోవచ్చు అంటూ లిరీష చెప్పుకొచ్చింది.
-
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
మోహన్ బాబు 'పద్మశ్రీ' వెనక్కు..తెర వెనుక, అనూహ్య పరిణామాలు..!! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications