నేను చెప్పుతో మాత్రమే కొట్టాను, హత్య ఎవరు చేశారో తెలీదు, స్టార్ హీరో గర్ల్ ఫ్రెండ్ సంచలనం

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తు రోజురోజుకూ ఊపందుకోవడంతోపాటు నిందితులపై వరుస సాక్షులు లభ్యమవుతున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ సహా మొత్తం పదిహేను మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం హీరో దర్శన్, ఆయన గర్ల్ ఫ్రెండ్ పవిత్రా గౌడతో సహ నిందితుల విచారణ కొనసాగుతోంది.

రేణుకాస్వామి హత్య కేసులో ఏ-1 నిందితురాలు పవిత్రా గౌడను పోలీసులు విచారిస్తున్న సమయంలో బిక్కిబిక్కి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. పవిత్రా గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకే రేణుకాస్వామిని హత్య చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. దీంతో పవిత్ర గౌడను ముమ్మరంగా విచారిస్తున్నారు. ఈ కేసులో మొదటి నిందితురాలు పవిత్ర గౌడ పోలీసుల విచారణలో కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని వెల్లడించినట్లు సమాచారం.

Actress Pavitra Gowda told the police that she had nothing to do with the murder case

రేణుకాస్వామి నాకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపేవాడని, దీన్ని మా ఇంటి పనిమనిషి పవన్‌కి పంపానని నటి పవిత్రా గౌడ పోలీసులకు చెప్పింది. దర్శన్‌కి చెబితే లేనిపోని సమస్యలు వస్తాయని, ఆయనకు చెప్పకూడదని తాను మా ఇంటి పనిమనిషి పవన్ కు ముందుగానే చెప్పానని నటి పవిత్రా గౌడ పోలీసులకు చెప్పిందని తెలిసింది. దర్శన్‌కి తెలిస్తే ఏదో ఘోరం జరుగుతుందని కూడా తాను ముందుగానే భయపడ్డానని నటి పవిత్రా గౌడ చెప్పిందని సమాచారం.

వాళ్ళు రేణుకాస్వామిని చంపేస్తారని నాకు తెలియదు. అశ్లీల సందేశాలు పంపిచడంతో తాను రేణుకామస్వామిని చెప్పుతో కొట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయానని పవిత్రా గౌడ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. పోలీసుల కస్టడీలో ఉన్న హీరో దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ పశ్చాత్తాపం చెందుతోందని తెలిసింది, అరెస్ట్ అయిన రోజు నుండి పవిత్ర గౌడ పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.

Actress Pavitra Gowda told the police that she had nothing to do with the murder case

కేసు దర్యాప్తులో భాగంతో పవిత్ర గౌడ్, దర్శన్ ను హత్య జరిగిన ప్రాంతానికి పిలుచుకుని వెళ్లారు. అయితే ఆ సందర్బంలో దర్శన్ దగ్గర నిలబడిన పవిత్రా గౌడ జనం చూస్తున్నా కంటతడి పెట్టారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో దర్శన్ కు రేణుకాస్వామి పంపించిన మెసేజ్ గురించి చెప్పి తాను పెద్ద తప్పు చేశాను అంటూ పవిత్ర గౌడ ఏడ్చినట్లు సమాచారం. హత్యకు గురైన రేణుకాస్వామి నాకు పంపిన మెసేజ్‌లను దర్శన్‌కు మొదట చెప్పలేదని పవిత్రా గౌడ పోలీసులకు చెప్పింది.

అసభ్యకరమైన మెసేజ్‌లు చూపించి మాట్లాడినందుకు నేను పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండవచ్చు. అసభ్యకరమైన సందేశంపై ఫిర్యాదు చేసి ఉంటే రేణుకాస్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకునేవారు. అది తప్ప ప్రతి సందేశాన్ని చూపించడం తప్పు. వారికి అశ్లీల మెసేజ్ లు చూపించి ఉండకూడదని, ఇది హత్య వరకు వెళ్తుందని తాను అనుకోలేదు అని దర్శన్ గర్ల్ ఫ్రెండ్, నటి పవిత్రా గౌడ కేసు విచారణ చేస్తున్న పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+