బాయ్ ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయిన బుట్టబొమ్మ.. వీడియో వైరల్ !!

స్టార్ బ్యూటీ, బుట్టబొమ్మ పూజా హెగ్దే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ అందరు ఠక్కున పూజా హెగ్దే పేరునే చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో 'మహర్షి', ప్రభాస్‌తో 'రాధే శ్యామ్', ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత', అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురం' సినిమాల్లో నటించి మెప్పించింది.

అయితే వరుస ఫ్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుక పడిపోయింది. 'రాధే శ్యామ్', 'ఆచార్య', 'బీస్ట్', 'సర్కస్', 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ఓ బాలీవుడ్ యువ హీరోతో డేటింగ్‌లో ఉన్నారన్న ప్రచారం బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

actress-pooja-hegde-caught-with-her-boy-friend-rohan-mehra-and-videos-got-viral-on-social-media

పూజా హెగ్డే పేరు గతంలో కూడా పలువురు హీరోలతో లింక్ అయింది. Hrithik Roshanతో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు ఒకప్పుడు వైరల్ కాగా, తర్వాత Varun Dhawanతో కూడా రిలేషన్‌లో ఉన్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడేమో బాలీవుడ్ యువ నటుడు Rohan Mehraతో పూజా హెగ్డే డేటింగ్‌లో ఉన్నారన్న కొత్త గాసిప్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ కలిసి పలుమార్లు రెస్టారెంట్లు, ఈవెంట్లలో కనిపించారని, ఒకే కారులో ప్రయాణించడం, కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వంటి అంశాలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా రోహన్, పూజా కుటుంబంతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రోహన్ మెహ్రా గురించి చెప్పాలంటే, ఆయన దివంగత బాలీవుడ్ నటుడు Vinod Mehra కుమారుడు. 70-80 దశకాల్లో వినోద్ మెహ్రా బాలీవుడ్‌లో ప్రముఖ రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. రోహన్ 2018లో వచ్చిన Bazaarతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తరువాత కొన్ని సినిమాల్లో నటించడంతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. అయితే పూజా-రోహన్ రిలేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ వార్తలు నిజమా? లేక సాధారణ గాసిప్‌లా? అన్నది ఇంకా క్లారిటీ లేదు.

ఇక ప్రస్తుతం పూజా హెగ్డే ఆశలన్నీ రాబోయే ప్రాజెక్టులపైనే ఉన్నాయి. తమిళ స్టార్ విజయ్‌తో కలిసి చేస్తున్న Jana Nayaganపై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే హిందీలో Hai Jawani Toh Ishq Hona Haiలో నటిస్తూ బాలీవుడ్‌లో మరోసారి సక్సెస్ సాధించాలని చూస్తోంది. అదనంగా Kanchana 4, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'DQ41' వంటి ప్రాజెక్టుల్లోనూ ఆమె కనిపించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+