నా బిడ్డను చంపిన వాళ్లు.. నా కళ్ల ముందే తిరుగుతున్నారు - నటి ప్రత్యూష తల్లి
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు అగ్రహీరోయిన్లలో ఒకరుగా గుర్తింపు పొందింది నటి ప్రత్యూష్. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు. తెలంగాణలోని భువనగిరికి చెందిన ఈమె.. చిన్న వయసులోనే సినీరంగంలో అడుగుపెట్టారు. కాగా తల్లితో కలిసి హైదరాబాద్ వచ్చిన ఈ భామ ఒక టీవీ రియాలిటీ షోలో పాల్గొని "శ్రీమతి లవ్లీ స్మైల్" బిరుదును గెలుచుకొని ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.
టాలీవుడ్ ఎంట్రీ..
1998లో మోహన్ బాబు నటించిన 'రాయుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆమె మోహన్ బాబు కూతురుగా కనిపించి.. తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస అవకాశాలు లభించాయి. తెలుగులో శ్రీరాములయ్య, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం ఐదు సంవత్సరాల్లో 11 సినిమాల్లో నటించి.. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తరుణంలో అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది.

అనుమానాస్పద మరణం..
కెరీర్ పీక్స్ లో ఉండగానే.. 2002లో ప్రత్యూష్ ఆత్మహత్య వ్యవహారం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మరణ సమయంలో ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. ఆమె డెత్ మిస్టరీ ఇప్పటికీ చర్చకు దారి తీస్తూనే ఉంటుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నారని.. రేప్ చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసులో సిద్ధార్థ్ కు కోర్టు జైలు శిక్ష కూడా విధించింది.
తల్లి సరోజినీదేవి న్యాయ పోరాటం..
అయితే ప్రత్యూష్ తల్లి సరోజినీదేవి ఈ విషయంలో ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా అమ్మాయి 16 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చింది. కానీ 19 ఏళ్లకే చనిపోయింది. మా అమ్మాయిని చంపేశారు.. ఆమెను చంపినవాళ్లు, వారి కుటుంబ సభ్యులు నా కళ్లముందు తిరుగుతున్నారు. ఎప్పటికైనా చట్టం వాళ్లను శిక్షిస్తుందని.. దేవుడు విధించే శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.












Click it and Unblock the Notifications