నా పిల్లల్ని ఉగ్రవాద సంస్థలో చేరమంటున్నారు: నటి ప్రియమణి
నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి న పనిలేదు. అందం, నటన, డ్యాన్స్ లతో ఆకట్టుకుంటున్నారు. యంగ్ హీరోయిన్లతో పోటీగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ ప్రస్తుతం బిజీగా మారారు. అయితే ఆమె 2017లో మతాంతర వివాహం చేసుకున్నారు. తన బాయ్ ఫ్రెండ్ ముస్తాఫారాజ్ ను పెళ్లిచేసుకున్నారు. అయితే 2016లోనే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆ రోజు నుంచి వీరిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్, విమర్శలు వస్తున్నాయి.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. తన ప్రియుడు ముస్తాఫారాజ్ ను వివాహం చేసుకున్నప్పటినుంచి కొందరు తనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు. ఆఖరికి తనకు పుట్టబోయే పిల్లల గురించి కూడా అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. "నాకు ఎంగేజ్‌మెంట్ జరగ్గానే నా బంధువులు, స్నేహితులు ఆనందిస్తారని అనుకున్నా. కానీ పెళ్లి తర్వాత నాపై అనవసరమైన ద్వేషం ప్రారంభమైంది. లవ్ జిహాద్ ఆరోపణలు వచ్చాయి. పిల్లలు పుట్టాక వారిని ISISలో జాయిన్ చేస్తారా అని కామెంట్స్ పెడుతున్నారు. అవి ఎంతగానో బాధ పెడుతున్నాయి. ఇప్పటికీ కూడా నేను నా భర్తతో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తే కామెంట్స్ అన్నీ మా వివాహం మీదనే ఉంటాయి. అవి చూసినప్పుడు బాధగా ఉంటుంది" అని ప్రియమణి తెలిపారు.













Click it and Unblock the Notifications