ఆగస్ట్ లో బుధాదిత్య, త్రిగ్రాహి, గజలక్ష్మీ , హంస రాజయోగాలు.. వీరికి తిరుగేలేదు!

ఆగస్టు మాసంలో గ్రహాలు సంచారం అన్ని రాశుల వారి జీవితం పైన తమ ప్రభావాన్ని చూపిస్తాయి జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు వేటికవే ప్రత్యేకమైనవి. నవగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ అక్కడ ఇతర గ్రహాలతో కలిసి అనేక శుభ శుభ యోగాలను ఏర్పరుస్తాయి .

ఆగస్ట్ మాసంలో శక్తివంతమైన యోగాలు

అలాగే ఆగస్టు మాసంలో కూడా గ్రహాల సంచారం గజలక్ష్మి రాజయోగాన్ని, బుధాదిత్య యోగాన్ని, త్రిగ్రాహి యోగాన్ని, హంస రాజ యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ శక్తివంతమైన యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

august powerful yogas Gajalakshmi Budhaditya trigrahi hamsa raj yogas gives luck to these zodiacs

మేష రాశి

మేష రాశి జాతకులకు ఆగస్టు మాసంలో ఏర్పడే రాజయోగాలు కారణంగా గణనీయమైన ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థికపరంగా మెరుగైన లాభాలు వస్తాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషదాయకం గా ఉంటుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకులకు ఆగస్టు మాసంలో ఏర్పడే రాజయోగాలు ప్రభావంతో గొప్ప ఫలితాలు వస్తాయి. అనేక రంగాలలో కర్కాటక రాశి వారి విజయం సాధించే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. కెరీర్ పరంగా కర్కాటక రాశి వారికి మంచి పురోగతి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంటుంది.

సింహరాశి

సింహ రాశి వారికి ఆగస్టు నెలలో ఏర్పడే ప్రత్యేక రాజయోగాలు కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ తిరిగి ప్రారంభిస్తారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులో సక్సెస్ అవుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఎంతోకాలంగా వసూలు కానీ మొండి బాకీలు కూడా ఈ సమయంలో వసూలవుతాయి.

కన్యారాశి

కన్యా రాశి వారికి ఆగస్టు నెల శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కెరీర్ పరంగా మంచి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు పనిచేసే చోట వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో మీకు మంచి గౌరవ లభిస్తుంది.

ప్రత్యక్ష సంచారంలోకి బుధుడు.. ఆగస్ట్ 5వరకు ఈ రాశులకు శుభాలు, లాభాలు!
ప్రత్యక్ష సంచారంలోకి బుధుడు.. ఆగస్ట్ 5వరకు ఈ రాశులకు శుభాలు, లాభాలు!

వృశ్చిక రాశి

ఆగస్టు నెల వృశ్చిక రాశి జాతకులకు శుభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకొనే అవకాశం ఉంది. ఈ సమయంలో అన్ని ప్రయత్నాలు విజయాలను సాధిస్తాయి. ఆర్థిక పరంగాను మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+