భర్త ముందే సమంతకు బిగ్ షాక్.. అభిమాని అలా చేసేసరికి !!
స్టార్ హీరోయిన్ సమంత.. 'ఏ మాయ చేసావే' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. నాగ చైతన్య సరసన 'ఏ మాయ చేసావే' సినిమాతో సమంత ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది సామ్. తెలుగులో చివరిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటించింది. ఆ తర్వాత సిటాడెల్: హనీ బన్నీ అనే యాక్షన్ వెబ్ సిరీస్‌లో నటించింది.
టాలీవుడ్ లో అందరూ స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గానే బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి ఏడడుగులు వేసి కొత్త జీవితం జీవితం మొదలుపెట్టింది. ప్రస్తుతం సమంత తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న Maa Inti Bangaram చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి Nandini Reddy దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో సమంత నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన ప్రతిభను చూపించనున్నారు.

అయితే 'మా ఇంటి బంగారం' మూవీ ట్రైలర్ విడుదల వేడుకలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. స్టేజీపై రాజ్ కుమార్ మాట్లాడుతుండగా ఓ అభిమాని సడన్‌గా పైకి వచ్చాడు. సమంత ముందు మోకాళ్లపై కూర్చొని ఆమెకు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత సెల్ఫీ తీసుకోవాలని యత్నించగా అక్కడి సిబ్బంది అతడిని పక్కకు లాగేయబోయారు. కానీ సమంత వారిని వారించి ఆ అభిమానితో నవ్వుతూ సెల్ఫీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భర్త ముందే సమంతకు అభిమాని ప్రపోజ్!#MaaIntiBangaram trailer launch event lo oka interesting incident jarigindi 😅❤️
— Milagro Movies (@MilagroMovies) May 26, 2026
Stage pai #RajKumar maatladutundaga, oka fan sudden ga stage paiki vachadu.#Samantha mundu mokalla pai kurchoni, aameki puvvu ichi propose chesadu 💐 pic.twitter.com/yB1zk5lojn












Click it and Unblock the Notifications